దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యొక్క ఆన్‌లైన్ సేవలు మరోసారి నిలిచిపోయాయి. యూపీఐ (UPI) ద్వారా లావాదేవీలు చేసేందుకు ప్రయత్నించిన కస్టమర్లు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. నిన్న కూడా ఇదే సమస్య ఎదురై, లావాదేవీలు నిలిచిపోవడంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ఇలాంటి సాంకేతిక సమస్యలు తరచూ ఎదురవ్వడం వల్ల దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ సేవలపై నమ్మకం తగ్గుతుందని కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Kavitha Birthday Special : కవితపై షార్ట్ ఫిలిం..ఫిదా అవుతున్న పార్టీ శ్రేణులు
ఈ సమస్యపై SBI అధికారికంగా స్పందించింది. “యూపీఐ లావాదేవీల్లో తాత్కాలిక సాంకేతిక లోపం తలెత్తింది. దీని వల్ల కస్టమర్ల లావాదేవీలు ఫెయిల్ అవుతున్నాయి. సమస్యను త్వరలోనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం” అని SBI పేర్కొంది. అంతేకాకుండా, కస్టమర్లు UPI లైట్ లావాదేవీలను ఉపయోగించుకోవచ్చని సూచించింది. అయితే, ఇప్పటికే చాలా మంది వినియోగదారులు తమ లావాదేవీలు నిలిచిపోయాయని, డబ్బులు అకౌంట్ నుంచి డెడక్ట్ అయ్యాయని, కానీ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్‌లోనే ఉందని సోషల్ మీడియాలో పలు పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలు విస్తరిస్తున్న ప్రస్తుత రోజుల్లో, ఈ తరహా సాంకేతిక సమస్యలు ఎదురవ్వడం ఆందోళన కలిగించే విషయం. SBI బ్యాంక్ తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకు సేవల నాణ్యత మెరుగుపడాలని, కస్టమర్లకు నష్టం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.