Site icon HashtagU Telugu

Festival Season : భారీగా క్యాష్‌బ్యాక్ ఇస్తున్న SBI

Sbi Cashback

Sbi Cashback

దసరా, దీపావళి పండుగ సీజన్ (Festival Season) షాపింగ్ కోసం ఎస్‌బీఐ (SBI) కార్డ్, ఫ్లిప్‌కార్ట్ ఒక కొత్త కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును తీసుకొచ్చాయి. ఈ క్రెడిట్ కార్డు ద్వారా షాపింగ్ చేసేవారికి క్యాష్‌బ్యాక్, ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. ఈ కార్డ్‌ను ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అని పిలుస్తారు. దీన్ని ఫ్లిప్‌కార్ట్ యాప్ లేదా ఎస్‌బీఐ కార్డ్ వెబ్‌సైట్ ద్వారా డిజిటల్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా కార్డు తీసుకునే వారికి రూ. 1,250 విలువైన వెల్‌కమ్ బెనిఫిట్స్ (ఇ-గిఫ్ట్ కార్డులు, వోచర్లు) లభిస్తాయి. అలాగే, పరిమిత కాలం ఆఫర్‌లో భాగంగా, ఈ కార్డును విజయవంతంగా పొందినవారు శామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌వాచ్‌లు, అంబ్రేన్ వైర్‌లెస్ పవర్ బ్యాంకులు గెలుచుకునే అవకాశం కూడా ఉంది.

TTD : కోట్లాది రూపాయాల టీటీడీ నిధులు వైసీపీ నేతలు మింగేశారు: టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు

ఈ కార్డుతో మింత్రాలో కొనుగోళ్లపై 7.5% క్యాష్‌బ్యాక్, ఫ్లిప్‌కార్ట్, షాప్సీ, క్లియర్‌ట్రిప్ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ప్రతి క్వార్టర్లో ఒక్కో కేటగిరీలో రూ. 4,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతేకాకుండా, జొమాటో, ఉబర్, నెట్‌మెడ్స్, పివిఆర్ వంటి కొన్ని బ్రాండ్లపై 4% క్యాష్‌బ్యాక్, ఇతర లావాదేవీలపై 1% అపరిమిత క్యాష్‌బ్యాక్ ఉంటుంది. పెట్రోల్ బంకులలో ఈ కార్డును ఉపయోగించినప్పుడు ప్రతి బిల్లింగ్ సైకిల్‌కు గరిష్టంగా రూ. 400 వరకు 1% ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపు కూడా ఉంటుంది. ఈ క్యాష్‌బ్యాక్ మొత్తం ఆటోమేటిక్‌గా మీ స్టేట్‌మెంట్‌కు క్రెడిట్ అవుతుంది.

ఈ కార్డుకు దరఖాస్తు చేసేటప్పుడు, అలాగే ఏటా రెన్యూవల్ చేయడానికి రూ. 500 ఫీజు ఉంటుంది. కానీ ఒక సంవత్సరంలో రూ. 3,50,000 ఖర్చు చేసిన వారికి ఈ వార్షిక ఫీజు తిరిగి లభిస్తుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్‌ను ఇష్టపడేవారికి, ముఖ్యంగా పండుగ సీజన్‌లో షాపింగ్ చేయాలనుకునే వారికి ఈ కార్డు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ భాగస్వామ్యం ద్వారా మరింత మంది భారతీయులకు క్రెడిట్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. ఈ కార్డు వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా రూపొందించామని ఎస్‌బీఐ కార్డ్ మేనేజింగ్ డైరెక్టర్ సలిలా పాండే చెప్పారు.