Auto Driver To Billionaire : సత్యశంకర్ ఒకప్పుడు ఆటో డ్రైవర్. ఆయన ఇప్పుడు బిలియనీర్. ఏకంగా రూ.800 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్నారు. ఇంతటి విజయం ఎలా సాధ్యమైంది? ఆటో డ్రైవర్ నుంచి బిలియనీర్ స్థాయికి సత్యశంకర్ ఎలా ఎదిగారు ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Shubhanshu Shukla: వింత జీవితో అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా
కెరీర్‌లో ఎన్నెన్నో మలుపులు..
కర్ణాటకలోని పుత్తూరు సమీపంలో ఉన్న చిన్న పల్లెటూరులో సత్యశంకర్ జన్మించాడు. ఆయన తండ్రి అర్చకుడు. సత్యశంకర్ ఇంటర్ తర్వాత చదువును ఆపేశారు. ఆటో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ స్కీం కింద లోన్ తీసుకుని.. ఒక ఆటోను సత్య కొన్నారు. తొలుత పుత్తూరు పరిధిలోనే సత్యశంకర్ ఆటో ట్రిప్పులు కొట్టేవాడు. ఆటో కోసం తీసుకున్న లోన్‌ని ఏడాదిన్నరలోనే తీర్చేసి అంబాసిడర్ కారును సత్య కొన్నారు. తద్వారా ట్యాక్సీ డ్రైవర్‌గా మారారు. తదుపరిగా కారును అమ్మేసి వచ్చిన డబ్బుతో ఆటో మొబైల్ గ్యారేజీని సత్య మొదలుపెట్టారు. తర్వాత అది కూడా మూసేసి.. ఫైనాన్స్ వ్యాపారాన్ని సత్య చేయసాగారు. అది కూడా సత్యకు నచ్చలేదు. దీంతో చాలా ఆసక్తిగా మంచి బిజినెస్ ఐడియా కోసం ఆయన రీసెర్చ్ చేశారు. చివరకు పుత్తూరు పరిధిలోని యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఎస్‌జీ కార్పొరేట్స్ పేరుతో ఒక సంస్థను సత్య స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ‘బిందు’ పేరుతో మినరల్ వాటర్ తయారీ వ్యాపారాన్ని ఆయన షురూ చేశారు. ఈక్రమంలో ఒకసారి ఉత్తర భారతదేశం టూర్‌కు వెళ్లినప్పుడు.. గోలీసోడా నీళ్లకి జీరా కలిపిన రుచిని తొలిసారి సత్య(Auto Driver To Billionaire) చూశాడు. ఆ సమయంలోనే.. జీరా సోడా బిజినెస్ ఆలోచన సత్యశంకర్ మైండ్‌లో వచ్చింది.
Also Read :Thackerays Reunion: ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే కలవబోతున్నారా ? ఇరుపార్టీల విలీనమా ?
15 దేశాలకు విస్తరించిన వ్యాపారం
జీర్ణశక్తిని పెంచే జీలకర్రకు కాస్త మసాలా రుచిని జోడించి ‘బిందు జీరా సోడా’ పేరుతో మార్కెట్లోకి సత్యశంకర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం జీరా సోడా వ్యాపారంలో ఎస్‌జీ కార్పొరేట్స్ దేశంలో నంబర్ 1 స్థాయిలో ఉంది. ఆరెంజ్, ఆపిల్, లెమన్, జింజర్ వంటి రుచుల్లో 55 రకాల పానీయాలనూ ఈ కంపెనీ అమ్ముతోంది. కొన్ని రకాల చిరుతిళ్లను కూడా సత్యశంకర్ కంపెనీ తయారు చేస్తోంది. దాదాపు రెండున్నర వేలమందికి ఉపాధిని కల్పిస్తోంది. ఏటా రూ.800కోట్ల రూపాయల టర్నోవర్‌ను సాధిస్తోంది. సత్యశంకర్ తన వ్యాపారాన్ని ఏకంగా 15 దేశాలకు విస్తరించారు. పెప్సీ, కోలాలతో పోటీపడుతూ దూసుకెళ్తున్న ‘బిందు ఫిజ్ జీరా మసాలా సోడా’ని సృష్టించిన సత్యశంకర్ ఈతరం యువతకు స్ఫూర్తి ప్రదాత.