Site icon HashtagU Telugu

GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

GST Slashed

GST Slashed

GST Slashed: బుధవారం జరిగిన జీఎస్టీ (GST Slashed) కౌన్సిల్ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎనిమిదేళ్ల పాత ట్యాక్స్ విధానంలో కొన్ని మార్పులు చేశారు. 12 శాతం, 28 శాతం ట్యాక్స్ స్లాబ్‌లను రద్దు చేసి.. 5 శాతం, 18 శాతం స్లాబ్‌లను ఆమోదించారు. దీని వల్ల నిత్య జీవితంలో ఉపయోగించే అనేక వస్తువులపై జీఎస్టీ తగ్గింది. దీంతో ఆ వస్తువుల ధరలు తగ్గుతాయి. సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. ఈ మార్పుల వల్ల బ్యూటీ ట్రీట్‌మెంట్స్, సేవలకు అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది.

బ్యూటీ ట్రీట్‌మెంట్ల ఖర్చు తగ్గుతుంది

జీఎస్టీ కౌన్సిల్ బ్యూటీ, ఫిజికల్ వెల్ బీయింగ్ సేవలకు జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. దీనికి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) వర్తించదు. ఇందులో సెలూన్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లు, బార్బర్లు, యోగా, హెల్త్ క్లబ్‌లు వంటివి ఉన్నాయి. అంటే ఇకపై మీరు హెయిర్‌కట్, ఫేషియల్, మసాజ్ లేదా ఫిట్‌నెస్ సెషన్స్ బుక్ చేసుకుంటే సర్వీస్ ఛార్జ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది జీఎస్టీ సంస్కరణల్లో ఒక భాగం. దీని ప్రధాన లక్ష్యం అవసరమైన సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడం.

Also Read: BCCI Sponsorship: స్పాన్సర్‌షిప్ బేస్ ధరను పెంచిన బీసీసీఐ..!

పర్సనల్ కేర్ ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి

సెలూన్‌లతో పాటు, ప్రభుత్వం సబ్బులు, షాంపూలు వంటి పర్సనల్ కేర్, పరిశుభ్రతకు సంబంధించిన అనేక వస్తువులపై కూడా జీఎస్టీని తగ్గించింది. టాయిలెట్ సోప్ బార్‌లపై ఇప్పుడు కేవలం 5 శాతం జీఎస్టీ మాత్రమే ఉంటుంది. ఈ నిర్ణయం మధ్య తరగతి కుటుంబాల నెలవారీ ఖర్చులను తగ్గించడానికి ఉద్దేశించబడింది. ఫేస్ పౌడర్, షాంపూలపై కూడా జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్, డెంటల్ ఫ్లాస్ వంటి దంత పరిశుభ్రతకు సంబంధించిన ఉత్పత్తులను కూడా ఇప్పుడు 5 శాతం స్లాబ్‌లోకి తెచ్చారు. అయితే మౌత్‌వాష్ మాత్రం ఈ జాబితా నుంచి మినహాయించారు.

జీఎస్టీ తగ్గుదల వల్ల బ్యూటీ ఉత్పత్తులు, కాస్మెటిక్స్ కోసం డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ట్యాక్స్ తగ్గడంతో సెలూన్‌లకు వెళ్లడం, హెల్త్ సర్వీస్‌లను పొందడం ప్రజలకు మరింత చౌకగా ఉంటుంది. సెప్టెంబర్ 3న జరిగిన సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ 12 శాతం, 28 శాతం స్లాబ్‌లను తొలగించి, 5 శాతం, 18 శాతం ట్యాక్స్ స్లాబ్‌లను ఆమోదించింది. దీంతో పాటు పాన్ మసాలా, గుట్కా, సిగరెట్లు, జర్దా వంటి పొగాకు ఉత్పత్తులు, బీడీలు వంటి ‘సిన్ గూడ్స్’ (నష్టదాయక వస్తువులు), లగ్జరీ వస్తువులపై 40 శాతం ట్యాక్స్ విధించాలని కూడా ప్రకటించారు.