అక్షయ తృతీయ (Akshaya Tritiya ) సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్‌లో కంపెనీ తమ ఎస్1 సిరీస్‌లోని జెన్ 2, జెన్ 3 మోడళ్లపై రూ.40 వేలు వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ సేల్‌ను పురస్కరించుకుని, స్కూటర్ కొనుగోలు చేసే కస్టమర్లకు ఉచిత వారెంటీతో పాటు, ఎంపిక చేసిన నగరాల్లో హైపర్ డెలివరీ (ఒకే రోజు డెలివరీ) సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. దీని ద్వారా వినియోగదారులు తమ స్కూటర్‌ను అదే రోజే పొందే అవకాశం ఉంది.
వివిధ మోడళ్లపై ధరల వివరాలు చూస్తే..
జెన్ 2 సిరీస్‌లో ఉన్న ఎస్1 ఎక్స్ 2 kWh బ్యాటరీ స్కూటర్‌ను ఇప్పుడు కేవలం రూ.67,499కే పొందవచ్చు. అలాగే 3 kWh వేరియంట్ రూ.83,999కి, 4 kWh వేరియంట్ రూ.90,999కి లభిస్తోంది. ఎస్1 ప్రో ధర రూ.1,11,999 నుంచి ప్రారంభమవుతోంది. జెన్ 3 సిరీస్‌లోని ఎస్1 ఎక్స్ 2 kWh వేరియంట్ ధర రూ.73,999, 3 kWh వేరియంట్ రూ.92,999, 4 kWh వేరియంట్ రూ.1,04,999, ఎస్1 ఎక్స్ ప్లస్ (4 kWh) ధర రూ.1,09,999గా ఉంది.
ప్రముఖ వేరియంట్‌లపై ప్రత్యేక ధరలు ఇలా ..
ఎస్1 ప్రో ప్లస్ (4 kWh) స్కూటర్ ధర రూ.1,48,999 కాగా, 5.4 kWh బ్యాటరీ వేరియంట్ ధర రూ.1,88,200గా ఉంది. ఎస్1 ప్రో 3 kWh వేరియంట్ ధర రూ.1,12,999, 4 kWh వేరియంట్ రూ.1,29,999గా ఉంది. ప్రస్తుతానికి హైపర్ డెలివరీ సర్వీసులు బెంగళూరులో ప్రారంభమవుతుండగా, త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ఓలా ప్రకటించింది. వినియోగదారులు ఈ అక్షయ తృతీయ ఆఫర్ ఉపయోగించుకుని తక్కువ ధరలో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లను సొంతం చేసుకోవచ్చు.