Site icon HashtagU Telugu

Vehicle Owners: జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి భారీ శుభవార్త!

Vehicle Owners

Vehicle Owners

Vehicle Owners: కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై వాహనాల్లో ప్రయాణించే (Vehicle Owners) వారికి శుభవార్తను అందించింది. జాతీయ రహదారులపై విధించే టోల్ ట్యాక్స్ రేట్లలో కొంత తగ్గింపు చేసింది. దీని వల్ల ఇప్పుడు ప్రయాణ సమయంలో ప్రజలు 50% వరకు తక్కువ టోల్ ట్యాక్స్ చెల్లించవచ్చు. ఈ తగ్గింపు మొత్తం జాతీయ రహదారులపై (నేషనల్ హైవేలు) వర్తించదు. కానీ కొన్ని ప్రత్యేక రకాల మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉన్న రహదారి భాగాలకు మాత్రమే వర్తిస్తుంది. దీని కోసం టోల్ ప్లాజా రుసుము లెక్కింపు పాత ఫార్ములాలో మార్పులు చేయబడ్డాయి. నితిన్ గడ్కరీ నేతృత్వంలోని రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ విషయంలో నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

ఎక్కడ పెరిగిన రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు

కేంద్ర రోడ్డు రవాణా- జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జులై 2న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో హైవేలో వంతెనలు, సొరంగాలు, ఫ్లైఓవర్లు వంటి మౌలిక సదుపాయాలు ఉన్న భాగంలో టోల్ ఫీజు లెక్కింపు కొత్త ఫార్ములా ద్వారా జరుగుతుందని తెలిపింది. ఈ ఫార్ములా ద్వారా టోల్ ట్యాక్స్ రేట్లలో తగ్గింపు ఉంటుంది. దీని వల్ల వాహనాదారుల‌కు లాభం చేకూరుతుంది. వారి ప్రయాణ ఖర్చు తగ్గుతుంది.

Also Read: Shiva Devotees : అరుణాచలం శివయ్య భక్తులకు IRCTC సూపర్ ప్యాకేజీ

2008 నిబంధనలలో మార్పులు

మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. టోల్ ట్యాక్స్ లెక్కింపు కోసం 2008 నిబంధనలలో మార్పులు చేయబడ్డాయి. ఇప్పటివరకు టోల్ ట్యాక్స్ లెక్కింపు NH ఫీజు నిబంధనలు 2008లో ఇచ్చిన ఫార్ములా ప్రకారం నిర్ణయించబడేది. దీని వల్ల మొత్తం జాతీయ రహదారిపై కిలోమీటరు ఆధారంగా ఫ్లాట్ టోల్ ట్యాక్స్ విధించబడేది. కానీ ఇప్పుడు కొత్త ఫార్ములా నిర్ణయించబడింది.

కొత్త ఫార్ములాలో రెండు రకాలుగా లెక్కింపు

నోటిఫికేషన్ ప్రకారం.. జాతీయ రహదారి ఏ భాగంలో వంతెనలు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, సొరంగాలు లేదా అటువంటి ప్రత్యేక మౌలిక సదుపాయాలు నిర్మించబడి ఉంటే ఆ భాగం టోల్ ట్యాక్స్ లెక్కింపు రెండు రకాలుగా జరుగుతుంది. మొదటి పద్ధతిలో ఆ మౌలిక సదుపాయం పొడవును 10 రెట్లు చేసి, జాతీయ రహదారి మిగిలిన పొడవుతో కలిపి లెక్కించబడుతుంది లేదా జాతీయ రహదారి యొక్క మొత్తం భాగం పొడవును 5 రెట్లు చేసి టోల్ ట్యాక్స్ లెక్కించబడుతుంది. ఈ రెండు లెక్కింపులలో ఏది తక్కువ టోల్ ట్యాక్స్ ఇస్తుందో.. ఆ రుసుము వసూలు చేయబడుతుంది. దీని వల్ల గతంతో పోలిస్తే తక్కువ టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

కొత్త మార్పుల తర్వాత ఏమి జరుగుతుంది?

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సీనియర్ అధికారి ఒకరి ద్వారా అమర్ ఉజాలా నివేదికలో ఈ కొత్త మార్పు కారణం వివ‌రించారు. అధికారి ప్రకారం.. పాత నిబంధనల కారణంగా ప్రతి కిలోమీటరుకు ఏదైనా ప్రత్యేక మౌలిక సదుపాయం కోసం సాధారణ టోల్ ఫీజు 10 రెట్లు చెల్లించాల్సి వచ్చేది. ఈ పద్ధతి ఆ మౌలిక సదుపాయం ఖర్చును పూర్తి చేయడానికి రూపొందించబడింది. ఇప్పుడు కొత్త నిబంధనలలో ఈ టోల్ ట్యాక్స్ సుమారు 50% వరకు తగ్గనుంది.