Bitcoin Price : క్రిప్టో క్యాపిటల్‌గా అమెరికాను మారుస్తా అని ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సాక్షాత్తూ కాబోయే అమెరికా అధ్యక్షుడే ఈ ప్రకటన చేయంతో క్రిప్టో కరెన్సీ మార్కెట్లు మంగళవారం పాజిటివ్ రేంజులో ట్రేడ్ అయ్యాయి. ప్రత్యేకించి బిట్ కాయిన్ ధర రికార్డు స్థాయిలో మునుపెన్నడూ లేని విధంగా రూ. 75 లక్షల(90వేల డాలర్ల)కు చేరింది. అంటే ఒక్క బిట్ కాయిన్‌ను కొనేందుకు మన దగ్గర రూ.75 లక్షలు ఉండాలి. దీంతో ఇప్పుడు అందరి చూపు ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీగా మారిన బిట్ కాయిన్(Bitcoin Price) వైపునకు మళ్లింది. నవంబరు 6న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై క్లారిటీ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు బిట్ కాయిన్ ధర దాదాపు 25 శాతానికిపైగా పెరగడం గమనార్హం.
Also Read :Hindu IAS Officers : ‘హిందూ ఐఏఎస్ ఆఫీసర్స్’ వాట్సాప్ గ్రూప్ వ్యవహారంలో కీలక పరిణామం
క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేసే వారిపై ప్రస్తుతం అమెరికాలో పలు పన్నులు విధిస్తున్నారు. వారిని అమెరికా ప్రభుత్వ ఆర్థిక విభాగాలు ట్రాక్ కూడా చేస్తున్నాయి. ఇలాంటి ఆంక్షలు లేకుండా చేసే దిశగా ట్రంప్ నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్రిప్టో కరెన్సీ మార్కెట్‌కు చేదోడునిచ్చే, ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్ని కల్పించే ఎలాంటి సంస్కరణలను ట్రంప్ ప్రకటిస్తారో వేచిచూడాలి.
Also Read :Krish got married to Priti Challa : రెండో పెళ్లి చేసుకున్న స్టార్ డైరెక్టర్
మరోవైపు ట్రంప్ మద్దతుదారుడు, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కంపెనీల షేర్లు కూడా అమెరికా స్టాక్ మార్కెట్‌లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ ‘టెస్లా’ షేర్ల ధరలు గత ఆరు రోజుల వ్యవధిలో ఏకంగా 40 శాతం మేర పెరిగాయి. ట్రంప్ ప్రభుత్వంలో ఎలాన్ మస్క్‌కు కీలక పదవిని కేటాయిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ట్రంప్ ఎన్నికల ప్రచారాన్ని మస్క్ భారీ విరాళాన్ని అందించారు. ఎన్నికల ప్రచారంతో ముడిపడిన చాలా అంశాల్లో సహకారాన్ని అందించారు. బహిరంగంగానూ ట్రంప్‌కు మద్దతుగా మస్క్ మాట్లాడారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఎలాన్ మస్క్ నికర సంపద విలువ రూ.25 లక్షల కోట్లకు చేరింది. దీంతో ప్రపంచంలోనే నంబర్ 1 ధనికుడిగా మస్క్ తన స్థానాన్ని నిలుపుకున్నారు.