Site icon HashtagU Telugu

Gold Loans: ఆర్బీఐ నిర్ణ‌యం త‌ర్వాత‌ బంగారు రుణాలు చౌకగా మారతాయా?

Gold And Silver Rate

Gold And Silver Rate

Gold Loans: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటు తగ్గించిన తర్వాత బంగారు రుణం (Gold Loans) కూడా చౌకగా మారుతుందా? ప్రస్తుతం ఈ ప్రశ్నకు సమాధానం లేదు అని తెలుస్తోంది. దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఇటీవల పాలసీ వడ్డీ రేట్లను తగ్గించింది. దీని కారణంగా రుణాలు చౌకగా, EMIలు తగ్గుతాయని అంచనాలు పెరిగాయి. కొన్ని బ్యాంకులు ఇప్పటికే దీన్ని అమ‌లు చేశాయి. అయితే చాలా బ్యాంకుల ఖాతాదారులు ఇప్పటికీ ఈ ఉపశమనం కోసం ఎదురు చూస్తున్నారు.

రెపో రేటు తగ్గింపు వల్ల బంగారం రుణాలు చౌకగా మారే అవకాశం లేదని ముత్తూట్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ చెప్పారు. ఆర్‌బిఐ కోత వల్ల నిధుల వ్యయం స్వల్పంగా తగ్గుతుందని ముత్తూట్ అంచనా వేస్తోందని, అందువల్ల బంగారు రుణాలు చౌకగా మారే అవకాశం లేదని మింట్ నివేదించింది. నిధుల వ్యయం 5-10 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చని ఆయన అన్నారు. ఇటువంటి పరిస్థితిలో రుణ రేటు అంతగా తగ్గుతుందని నేను అనుకోను అని స్ప‌ష్టం చేశారు.

Also Read: Elon Musk : ‘‘నా బిడ్డకు తండ్రి మస్క్’’.. యాష్లీ సెయింట్‌ క్లెయిర్ ఎవరు ?

దేశంలోని అతిపెద్ద గోల్డ్ లోన్ కంపెనీ అయిన ముత్తూట్ ఫైనాన్స్ త్రైమాసిక ఫలితాల గురించి మాట్లాడితే.. దాని నికర లాభం 33% పెరిగింది. అదేవిధంగా కంపెనీ నికర వడ్డీ ఆదాయం 42.8% పెరిగి రూ.1,905.7 కోట్ల నుంచి రూ.2,721.4 కోట్లకు చేరుకుంది. కంపెనీ గత కొన్ని నెలల్లో 1.37 మిలియన్ల కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ముత్తూట్ ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం బంగారానికి బలమైన డిమాండ్, దాని ధరలు వేగంగా పెరగడం.

రుణం తీసుకునేవారు పెరిగారు

గోల్డ్ లోన్‌కు డిమాండ్ పెరిగిందని జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ తెలిపారు. వాస్తవానికి గత కొన్ని నెలల్లో ఇతర వనరుల నుండి వచ్చే క్రెడిట్, ముఖ్యంగా ఫిన్‌టెక్ రుణాలు, మైక్రోఫైనాన్స్ రుణాలు ప్రభావితమయ్యాయి. దీని కారణంగా బంగారు రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. మూడవ త్రైమాసికంలో ముత్తూట్ మైక్రోఫైనాన్స్ రుణాలలో భారీ క్షీణతను చూసింది. దాని అనుబంధ సంస్థ బెల్‌స్టార్ మైక్రోఫైనాన్స్ అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (AUM) డిసెంబర్ చివరి నాటికి రూ. 87,032 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ చివరి నాటికి ఇది రూ. 96,253 కోట్లుగా ఉంది.

వచ్చే మూడు, నాలుగు త్రైమాసికాల వరకు మైక్రోఫైనాన్స్ వ్యాపారం నిలిచిపోనుందని ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ తెలిపారు. ఈ సమయంలో అన్ని మైక్రోఫైనాన్స్ కంపెనీలు సమస్యలను ఎదుర్కొంటున్నాయని, అందుకే అవి రుణం ఇవ్వడం తగ్గించాయని తెలిపారు. షేర్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే.. నిన్న ముత్తూట్ ఫైనాన్స్ షేర్లు పడిపోయి రూ.2,245.15 వద్ద ముగిసింది. గత 5 సెషన్లలో 1.20% లాభపడింది.