దేశీయ కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల (Non-banking financial Institutions) (ఎన్‌బీఎఫ్‌సీ) పైన నిఘా పెట్టింది. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలపై చర్యలు తీసుకుంటూ ఇటీవల మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 2025 జనవరి నెల ప్రారంభం నుంచే 10 ఫైనాన్షియల్ సంస్థల లైసెన్సులను రద్దు చేసినట్లు ప్రకటించింది. వీటిలో ఎక్కువ కంపెనీలు పశ్చిమ బెంగాల్‌కు చెందినవిగా గుర్తించారు.
AP Govt : పేదలకు ఇళ్ల స్థలాలపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ఆర్‌బీఐ తాజా చర్యల కారణంగా లైసెన్సులు రద్దైన సంస్థలు రూల్స్, రెగ్యులేషన్స్ పాటించలేదని తేలింది. ఈ కంపెనీలు ఆర్థిక వ్యాపార కార్యకలాపాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాయని ఆర్‌బీఐ నిర్ధారించింది. ఈ నిర్ణయంతో ఆ కంపెనీలు ఇకపై నాన్-బ్యాంకింగ్ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతించబడవు. తాజాగా లైసెన్సులు రద్దయిన సంస్థల జాబితాలో ఈస్ట్ ఇండియా లీజింగ్ కంపెనీ లిమిటెడ్, కకరనియా ట్రేడింగ్, గోల్డ్ స్టార్ బిజినెస్ లిమిటెడ్, సైబర్ అడ్వైజరీ సర్వీసెస్ లిమిటెడ్, జీత్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లంఘించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే, మరో 7 కంపెనీలు తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను స్వచ్ఛందంగా సరెండర్ చేశాయి. వీటిలో స్ట్రైకర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్, నరీంద్ర సింగ్ అండ్ సన్స్, మోంట్ గోమోరీ ఫైనాన్స్ కంపెనీ, శ్రీ మహాలక్ష్మీ ఇన్వెస్ట్‌మెంట్ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలకు ఆర్థిక వ్యాపారాలపై మున్ముందు అనుమతి ఉండదు. ఆర్‌బీఐ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఉన్నాయి. నిబంధనలను పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా పైనాన్షియల్ వ్యవస్థలో నమ్మకాన్ని పెంచే ప్రయత్నం జరుగుతోంది. ఇటువంటి చర్యల వల్ల నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సి వస్తుంది.