RBI Bars Loans: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. మీకు ఈ బ్యాంక్‌లో ఖాతా ఉంటే ఇప్పుడు ఎలాంటి లావాదేవీలు జరపలేరు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI Bars Loans) తాజాగా వెలువరించింది. పూర్తి స్థాయిలో కారణాలు తెలియదు కానీ ఈ బ్యాంక్‌లో ఖాతా ఉన్నవారి లావాదేవీలపై నిషేధం విధిస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే ఆ బ్యాంక్ ఏంటీ? ఆ బ్యాంక్‌లో ఉన్న వినియోగదారుల డబ్బు సంగతేంటి? అనే విషయాలపై కూడా ఆర్‌బీఐ ఓ క్లారిటీ ఇచ్చింది. ఆ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బు ఎక్కడికి పోదని కూడా పేర్కొంది. ఆ బ్యాంక్ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై పెద్ద చర్య తీసుకుంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ వ్యాపార కార్యకలాపాలను నిషేధించింది. దీని ప్రకారం.. బ్యాంకు కొత్త రుణాలు ఇవ్వదు లేదా డిపాజిట్లు తీసుకోదు. ఏదైనా కొత్త పెట్టుబడులు తీసుకోవడం, రుణాలను తిరిగి చెల్లించడం కూడా ఆర్‌బీఐ నిషేధం విధించింది. 5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేసే హక్కు డిపాజిటర్లకు ఉంటుంది. బ్యాంకు పరిస్థితి మెరుగుపడే వరకు ఆర్‌బీఐ ఆంక్షలు అమలులో ఉంటాయి.
Also Read: Self Cleaning Cloth: సెల్ఫ్ క్లీనింగ్ క్లాత్ వచ్చేసింది.. అత్యంత చలిలోనూ ఇక బేఫికర్
ఆర్‌బీఐ తీసుకున్న ఈ చర్య న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో ఖాతాలు కలిగి ఉన్న వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది. డిపాజిటర్లు తమ డబ్బును విత్‌డ్రా చేయకుండా ఆర్‌బీఐ కూడా నిషేధం విధించింది. ఇప్పుడు డిపాజిటర్లు రూ. 5 లక్షల వరకు డిపాజిట్ బీమాను పొందుతారు. అంటే ప్రజలు తమ డబ్బును పోగొట్టుకుంటే ఖాతాదారులకు రూ.5 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. బ్యాంక్ ఈ చర్య ఎందుకు తీసుకుందనే దానిపై ఆర్‌బిఐ నుండి ఇంకా ఎక్కువ సమాచారం లేదు. అయితే బ్యాంకు పరిస్థితి మెరుగుపడే వరకు ఆర్‌బీఐ ఆంక్షలు అమలులో ఉంటాయని చెబుతున్నారు.
ఈ ఆంక్షలు ఆరు నెలల పాటు అమల్లో ఉంటాయి
అయితే ఈ ఆంక్షలను.. ఆర్‌బిఐ బ్యాంకింగ్ లైసెన్స్‌ను రద్దు చేసినట్లుగా చూడకూడదు. బ్యాంక్ తన ఆర్థిక స్థితి మెరుగుపడే వరకు పై సూచనలలో పేర్కొన్న పరిమితులకు లోబడి బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తుంది. ఆర్‌బిఐ బ్యాంకులో పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉంటుంది. డిపాజిటర్ల ప్రయోజనాల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఈ సూచనలు ఫిబ్రవరి 13, 2025న వ్యాపారం ముగిసినప్పటి నుండి ఆరు నెలల పాటు అమలులో ఉంటాయి. సమీక్షకు లోబడి ఉంటాయి.