Site icon HashtagU Telugu

PM-KISAN: నేడు అకౌంట్లోకి డ‌బ్బులు.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటే ఏమిటి..?

SBI- HDFC

SBI- HDFC

PM-KISAN: రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ (PM-KISAN) సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద కొంత మొత్తాన్ని రైతుల ఖాతాలకు పంపుతారు. ఈ మొత్తాన్ని విడతల వారీగా అందజేస్తారు. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 17 వాయిదాల్లో డ‌బ్బు ఇచ్చారు. ఇప్పుడు దాని 18వ విడత అక్టోబర్ 5న రాబోతోంది. రైతుల కోసం ఈ పథకాన్ని ఎందుకు, ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకం కింద ఇప్పటి వరకు ఎంత డబ్బు ఇచ్చారు? తెలుసుకుందాం.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటే ఏమిటి?

రైతులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు పీఎం కిసాన్ యోజన ప్రారంభించారు. గతంలో ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో ప్రారంభించింది. దీని తర్వాత 1 ఫిబ్రవరి 2019న ఈ పథకం భారతదేశం మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2019లో దేశవ్యాప్తంగా ప్రాజెక్ట్‌గా అమలు చేయబడింది. ప్రధాని మోదీ ఈ పథకాన్ని 24 ఫిబ్రవరి 2019న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రారంభించారు. ఈ పథకంలో రైతులకు 4 నెల‌ల‌కొక‌సారి 3 విడతలు అందజేస్తారని, అందులో ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు లభిస్తాయని మ‌న‌కు తెలిసిందే.

Also Read: Rajendra Prasad Daughter: టాలీవుడ్‌లో పెను విషాదం.. రాజేంద్ర‌ప్ర‌సాద్ కూతురు క‌న్నుమూత‌

18 విడతల్లో ఎంత డబ్బు పంపిణీ కానుంది?

ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 17 విడతలు విడుదలయ్యాయి. 18వ భాగం అక్టోబర్ 5న (నేడు) విడుదల కానుంది. 18వ విడతలో రూ.20 వేల కోట్లు పంపిణీ చేయనున్నారు. మొదటి విడత నుంచి మొత్తం రూ.3.45 లక్షల కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి. దీని ద్వారా 11 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నట్లు సమాచారం.

ఈ పథకం లబ్దిదారుగా మారడానికి కొన్ని షరతులను నెరవేర్చడం అవసరం అని మ‌న‌కు తెలిసిందే. ఇందులో వ్యవసాయానికి భూమి ఉన్న రైతులు మాత్ర‌మే అర్హులు. ఈ భూమి 2 హెక్టార్ల వరకు ఉండాలి. అంతకు మించి ఉన్న‌వారికి ప్రయోజ