Site icon HashtagU Telugu

Haldiram – PepsiCo : హల్దీరామ్‌‌లోకి పెప్సీకో ఎంట్రీ.. వాటా కొనుగోలుకు చర్చలు

Haldiram Pepsico Snacks Market 

Haldiram – PepsiCo : హల్దీరామ్‌.. ఈ కంపెనీకి మనదేశంలో స్నాక్స్ వ్యాపారంలో తిరుగులేదు. ఈ కంపెనీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రఖ్యాత కూల్ డ్రింక్స్ కంపెనీ పెప్సీకో ప్రయత్నాలు చేస్తోంది.  హల్దీరామ్‌ కంపెనీలోని దాదాపు 15 శాతం వాటాను కొనేందుకు ఆసక్తిని కనబరుస్తోంది. పెప్సీకోతో పాటు టెమాసెక్‌, ఆల్ఫావేస్‌ గ్లోబల్‌ కంపెనీలు కూడా హల్దీరామ్‌‌లో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నాయి. మనందరికీ సుపరిచితమైన లేస్‌, కుర్ కురే వంటి చిరుతిండ్ల బ్రాండ్‌లు పెప్సీ కంపెనీవే. ప్రస్తుతం మనదేశంలోని స్నాక్స్‌ మార్కెట్లో 24 శాతం వాటా పెప్సికో చేతిలోనే ఉంది.

Also Read :Meta Apology : భారత ఎన్నికలపై జుకర్‌బర్గ్ కామెంట్స్ తప్పే.. సర్కారుకు మెటా కంపెనీ సారీ

15 శాతం వాటా కోసం రేసు..

భారతదేశంలో చిరుతిండ్ల వ్యాపారంలో హల్దీరామ్‌ కంపెనీ ప్రతి సంవత్సరం భారీ టర్నోవర్ సాధిస్తోంది. దీని అమ్మకాలు రికార్డు స్థాయుల్లో జరుగుతున్నాయి. అగర్వాల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో హల్దీరామ్ కంపెనీ(Haldiram – PepsiCo) వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా నడుస్తోంది. తమ కంపెనీ విలువ దాదాపు రూ.90వేల కోట్ల దాకా ఉంటుందని అగర్వాల్ కుటుంబం వ్యాల్యుయేషన్ ఇచ్చుకుంటోందని సమాచారం. ఈ వ్యాల్యుయేషన్‌కు అనుగుణంగా తమ కంపెనీలోని 15 శాతం వాటాను అమ్మేందుకు వారు రెడీగా ఉన్నారట. ఈవిషయం తెలియడంతో పెప్సీకో, టెమాసెక్‌, ఆల్ఫావేస్‌ గ్లోబల్‌ కంపెనీలు క్యూ కట్టాయి. ప్రస్తుతం అవి అగర్వాల్ కుటుంబంతో చర్చలు జరుపుతోంది. ఎంత వాటా ఇస్తారు ? ఎంత పెట్టుబడి పెట్టాలి ? కంపెనీ వ్యాల్యుయేషన్ ఎంత ? అనే అంశంపై వారి మధ్య చర్చలు జరుగుతున్నాయి. హల్దీరామ్‌ కంపెనీకి మంచి వ్యాల్యుయేషన్ ఇచ్చే వారికే వాటాను విక్రయిస్తామని అగర్వాల్ ఫ్యామిలీ చెబుతోంది. గత నెలలోనే తమకు టెమాసెక్‌, ఆల్ఫావేస్‌ గ్లోబల్‌ కంపెనీల నుంచి బైండింగ్ ఆఫర్లు వచ్చాయని తెలిపింది. ఆ కంపెనీలు 10 నుంచి 15 శాతం వాటా కొనేందుకు రెడీగా ఉన్నాయని వెల్లడించింది.

Also Read :Futuristic Robotic Mules : ఆర్మీ రోబోలు ఇవిగో.. ఆర్మీ డే పరేడ్‌తో బరిలోకి.. ఇవేం చేస్తాయంటే ?

Exit mobile version