PAN Card: దేశంలోని దాదాపు అందరూ పాన్ కార్డును ఉపయోగిస్తున్నారు. బ్యాంకు ఖాతా తెరవడం నుంచి ఇతర పథకాల ప్రయోజనాలను పొందే వరకు పాన్ కార్డు (PAN Card) తప్పనిసరిగా ఉండాలి. ఆర్థిక గుర్తింపు కోసం ఇది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్‌గా కూడా పరిగణిస్తారు. ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ సంఖ్యలు 10 అక్షరాలు, సంఖ్యల కాంబినేషన్ ఈ పాన్ కార్డు. పాన్ కార్డ్ ద్వారా ఆదాయపు పన్ను శాఖ నుండి ఏదైనా ఆర్థిక సమాచారాన్ని పొందడం సులభం. ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డ్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. దీనిలో ఏ పాన్ కార్డ్ హోల్డర్‌లు రూ. 10,000 వరకు జరిమానా విధించవచ్చో కూడా పేర్కొంది.
ఈ పాన్ కార్డుదారులకు రూ.10 వేలు జరిమానా!
పాన్ కార్డులను దుర్వినియోగం చేసిన లేదా నిబంధనలను పాటించని హోల్డర్లపై ఆదాయపు పన్ను శాఖ భారీ జరిమానా విధించే యోచనలో ఉంది. పాన్ కార్డ్‌లో తప్పు పేరు, చిరునామా లేదా ఇతర సమాచారాన్ని అందించడమే కాకుండా మీరు తప్పు స్థలంలో పాన్ కార్డ్‌ని ఉపయోగిస్తే చర్యలు తీసుకోనుంది. అదే విధంగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకుంటే భారీ మొత్తంలో కూడా జరిమానా విధించే ఛాన్స్ ఉంది.
Also Read: Honda City Apex Edition: హోండా నుంచి మరో కారు.. ధర, ఫీచర్ల వివరాలివే!
ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు
ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. దానికి విధించే శిక్షలో జరిమానా చెల్లించడం కూడా ఉంటుంది. సెక్షన్ 272B ప్రకారం.. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉన్న పాన్ కార్డ్ హోల్డర్లపై ఆదాయపు పన్ను శాఖ రూ. 10,000 వరకు జరిమానా విధిస్తుంది. మీరు ఇప్పటికే ఒక పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ అప్‌డేట్ పొందకముందే మళ్లీ దరఖాస్తు చేస్తే రెండు పాన్ కార్డ్‌లు తయారు అవుతాయి. ఇటువంటి పరిస్థితిలో మీరు ఆదాయపు పన్ను శాఖను సంప్రదించి ఒక పాన్ కార్డును బ్లాక్ చేయాల్సి ఉంటుంది.
తప్పుడు సమాచారం అందించడం
మీరు పాన్ కార్డ్‌లో పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీ వంటి తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తే మీకు సమస్యలు తలెత్తవచ్చు. సమాచారం తప్పుగా నమోదు చేసినట్లయితే మీరు సరైన సమాచారం, పత్రాలతో పాన్ కార్డ్‌ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆదాయపు పన్ను శాఖ మీకు జరిమానా విధించవచ్చు. పెళ్లయ్యాక ఇంటిపేరు మారినా, మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి రావచ్చు.