కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి (Terror Attack) తర్వాత భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. దీంతో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (Pakistan Stock Market) తీవ్రంగా క్షీణించింది. రెండు రోజులు వరుసగా మార్కెట్ భారీ నష్టాలు చవిచూసింది. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే KSE-100 ఇండెక్స్ 2.12% పతనమై 2,485 పాయింట్లు తగ్గింది. దీని ప్రభావంతో PSX వెబ్‌సైట్ కూడా ఒక్కసారిగా క్రాష్ అయ్యింది. “WE’LL BE BACK SOON” అనే సందేశంతో వెబ్‌సైట్ మూతపడగా, ఇది మెయింటెనెన్స్ లో ఉందని ప్రకటించారు.
Amit Shah : ఒక్క పాకిస్థాన్ వాడు కూడా ఉండదు.. రాష్ట్రాలకు అమిత్ షా కీలక ఆదేశాలు..!
ఈ పరిస్థితికి కారణంగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థ IMF తాజాగా పాకిస్తాన్ GDP వృద్ధి అంచనాను 2.6%కి తగ్గించడం, దేశీయంగా రాజకీయ అస్థిరత, కరెన్సీ బలహీనత, భద్రతా సమస్యలు ఉన్నాయి. ఫిచ్ రేటింగ్స్ సంస్థ కూడా పాక్ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ విధించిన ఆంక్షలు , సింధు జలాల ఒప్పందం రద్దు, వాణిజ్య మార్గాల మూసివేత, పాక్ పౌరుల వీసాల రద్దు వంటి చర్యలు పెట్టుబడిదారుల భయాలను మరింత పెంచాయి. ఈ ప్రభావం భారత మార్కెట్ పై కూడా పడింది. దలాల్ స్ట్రీట్ సుమారు 500 పాయింట్లు పడిపోయింది.
వెబ్‌సైట్ క్రాష్‌కు అధికారికంగా ఏ కారణం తెలియజేయలేదు గానీ, టెక్నికల్ సమస్యగా భావించబడుతోంది. అయితే, ఇది తాత్కాలికమేనా? లేక మార్కెట్ అస్థిరత మరింత కొనసాగుతుందా? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అనలిస్టుల అంచనాల ప్రకారం.. పాక్ స్టాక్ మార్కెట్ స్వల్ప కాలంలో మరింత ఒడిదుడుకులు ఎదుర్కొనవచ్చు అని అంటున్నారు.