Oyo USA : భారతీయ బ్రాండ్ ‘ఓయో’ ఇక అమెరికాలో మరింత విస్తరించనుంది. అమెరికాకు చెందిన జీ6 హాస్పిటాలిటీ కంపెనీని ఓయో కొనుగోలు చేయనుంది. ఈ కంపెనీ అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో లాడ్జీల ఫ్రాంఛైజీలను నడుపుతోంది. ఇప్పటివరకు జీ6 హాస్పిటాలిటీ కంపెనీని బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్వహించేది. రూ.4,300 కోట్ల ధరకు జీ6 హాస్పిటాలిటీని ఓయో దక్కించుకోనుంది. ఈవిషయాన్ని ఓయో పేరంట్ ఆర్గనైజేషన్ ఓర్వల్ స్టేస్ వెల్లడించింది. పూర్తి నగదు రూపంలో ఈ లావాదేవీ జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ డీల్‌తో ఓయో వ్యాపారం అమెరికాలో(Oyo USA) మరింతగా విస్తరించనుంది.
Also Read :IAF Chief : భారత వాయుసేన తదుపరి చీఫ్‌గా అమర్‌ప్రీత్ సింగ్ : రక్షణశాఖ
- భారత్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో ఓయో ప్రస్తుతం సేవలు అందిస్తోంది.
- ఓయో కంపెనీ 2019 సంవత్సరంలో అమెరికాలోకి అడుగుపెట్టింది.
- ప్రస్తుతం అమెరికాలోని 35 రాష్ట్రాల్లో 320కిపైగా హోటళ్లను ఓయో నిర్వహిస్తోంది. కేవలం గత ఏడాది వ్యవధిలోనే తమ జాబితాలోకి కొత్తగా 100 హోటళ్లను ఓయో చేర్చుకుంది.
- ఈ ఏడాది అమెరికాలోని మరో 250 హోటళ్లను తన పోర్ట్‌ఫోలియోలోకి చేర్చుకోవాలని ఓయో లక్ష్యంగా పెట్టుకుంది.
- అమెరికాలో విస్తరణను వేగవంతం చేసే లక్ష్యంలో భాగంగానే మోటల్ 6, స్టూడియో 6 బ్రాండ్లను ఓయో కొనుగోలు చేయనుందని తెలిసింది. ఈ కొనుగోలు ప్రక్రియ వచ్చే ఏడాది చివరికల్లా పూర్తయ్యే అవకాశం ఉంది.
- మోటల్ 6కు అమెరికాలో మంచి గుర్తింపు ఉంది. ఓయోకు ఉన్న అనుభవంతో అది మరింత వృద్ధి సాధించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
- మోటల్ 6 బ్రాండ్‌లో బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సంస్థ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టింది. దీంతో చివరకు ఆ కంపెనీ బ్లాక్ స్టోన్ వశమైంది.
- ఇప్పుడు ఆ కంపెనీని ఓయోకు అమ్మేయాలని బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ నిర్ణయించింది.
- అమెరికా, కెనడాలో మోటల్ 6కు దాదాపు 1500కు పైగా హోటళ్లు ఉన్నాయి.
- త్వరలో ఐపీఓకు రావాలని ఓయో భావిస్తోంది. ఈక్రమంలోనే అమెరికాలో విస్తరణకు సంబంధించిన డీల్‌ను కుదుర్చుకోవడం గమనార్హం.
- ఈ పరిణామంతో ఐపీఓలో ఓయోకు పెద్దగా కలిసొచ్చే అవకాశం ఉంది.