Site icon HashtagU Telugu

One8 Commune : హైద‌రాబాద్‌లో కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించిన విరాట్ కోహ్లీ

One8 Commune Open At Hydera

One8 Commune Open At Hydera

స్టార్ క్రికెటర్ విరాట్‌ కోహ్లీ (Virat Kohli).. ఓ పక్క క్రికెట్ లో రాణిస్తూనే మరోపక్క బిజినెస్‌లోనూ అదే రేంజ్లో దుకెళ్తున్నాడు. 2017 నుంచి వన్‌ 8 కమ్యూన్‌ (One8 Commune) పేరుతో రెస్టారెంట్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన విరాట్‌.. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పూణే, బెంగళూరులో బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు హైదరాబాద్‌ కూడా బ్రాంచ్ ఓపెన్ చేసాడు. హైటెక్‌ సిటీలోని హార్డ్‌ రాక్ కేఫ్‌ సమీపంలో ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ రెస్టారెంట్‌ ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ లో ‘మేము ఇప్పటికే హైదరాబాద్ హైటెక్ సిటీ నడిబొడ్డుకు వచ్చేశాం. నాకు, వన్8 కమ్యూన్ అనేది కేవలం ఒక రెస్టారెండ్ మాత్రమే కాదు. ఇది హైదరాబాద్‌ లోని ప్రజలను ఒకేచోటకు చేర్చడం మా ముఖ్య ఉద్దేశం’ అంటూ కోహ్లీ వ్యాఖ్యానించారు. తన రెస్టారెంట్‌ కు విచ్చేయాలని ఆయన ఈ సందర్బంగా ఆహ్వానించారు. ఇక ఈ ఓపెనింగ్ వేడుకకు ఆర్‌సీబీ ఆట‌గాళ్లు వ‌చ్చి సందడి చేశారు. కాగా ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక ఇందులో భార‌తీయ వంట‌కాల‌తో పాటు విదేశీ వంటకాలను అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలుస్తుంది.

Read Also : TS : తెలంగాణలో పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల