Site icon HashtagU Telugu

Bank Holidays: బ్యాంకు వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. మొత్తం 10 రోజుల సెల‌వులు!

Bank Holidays

Bank Holidays

Bank Holidays: అక్టోబరు నెల ముగియనుంది. నవంబరు ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో మీరు నవంబర్‌లో బ్యాంకు పనులు పూర్తి చేయాలని ఆలోచిస్తున్నట్లయితే బ్యాంకులు (Bank Holidays) ఎప్పుడెప్పుడు సెలవులో ఉంటాయో ముందుగా తెలుసుకోవడం మంచిది. అక్టోబరుతో పోలిస్తే నవంబర్‌లో సెలవులు తక్కువగా ఉన్నప్పటికీ.. కొన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి.

దేశవ్యాప్తంగా నవంబర్‌లో బ్యాంకులు 9 నుండి 10 రోజుల పాటు మూసి ఉండవచ్చు. ఇందులో ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు, అలాగే ప్రాంతీయ పండుగల కారణంగా కొన్ని రాష్ట్ర స్థాయి సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవుల సమయంలో డిజిటల్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు పూర్తిగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఎలాంటి ఆటంకం లేకుండా చాలా వరకు లావాదేవీలను కొనసాగించవచ్చు.

Also Read: MP Chamala: మైనార్టీలపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ విద్వేషం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

నవంబర్‌లో ముఖ్యమైన సెలవులు

వారాంతపు సెలవులు

నవంబర్ నెలలో మొత్తం ఐదు ఆదివారాలు (నవంబర్ 2, 9, 16, 23, 30) దేశవ్యాప్తంగా బ్యాంకులకు వారాంతపు సెలవులు ఉంటాయి. బ్యాంకు శాఖల ద్వారా జరగాల్సిన పనులను పని దినాల్లోనే పూర్తి చేసుకోవాలని, అత్యవసర లావాదేవీల కోసం డిజిటల్, ఆన్‌లైన్ సేవలను ఉపయోగించుకోవాలని బ్యాంకు అధికారులు తెలిపారు.

Exit mobile version