Site icon HashtagU Telugu

Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

Digital Gold

Digital Gold

Digital Gold: మీరు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో డిజిటల్ గోల్డ్‌ను (Digital Gold) కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నా లేదా ఇప్పటికే పెట్టుబడి పెడుతున్నా ఈ వార్త మీకు చాలా ముఖ్యం. అవును డిజిటల్ గోల్డ్ పెట్టుబడిలో అనేక పెద్ద ప్రమాదాలు దాగి ఉన్నాయని సెబీ (SEBI) మదుపరులను (Investors) స్పష్టమైన పదాలలో హెచ్చరించింది. డిజిటల్ బంగారం కొనుగోలు చాలా సులభంగా అనిపించడం వల్ల కొత్త పెట్టుబడిదారులు తరచుగా విస్మరించే ప్రమాదాలు ఇవి.

సెబీ ప్రకారం.. చాలా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు డిజిటల్ గోల్డ్ లేదా ఈ-గోల్డ్‌ను అమ్ముతున్నాయి. దీనిని ఫిజికల్ గోల్డ్‌కు (భౌతిక బంగారం) మెరుగైన ప్రత్యామ్నాయంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే నిజం ఏమిటంటే ఈ ఉత్పత్తులు SEBI ద్వారా నియంత్రించబడవు.

SEBI ఏ రకమైన బంగారు పెట్టుబడిని నియంత్రిస్తుంది?

ఇలాంటి డిజిటల్ పెట్టుబడులు పూర్తిగా ఎలాంటి పర్యవేక్షణ లేకుండా ఉంటాయి. పెట్టుబడిదారులు కౌంటర్‌పార్టీ, కార్యాచరణ రిస్క్‌లను ఎదుర్కోవచ్చు. తాము ఏ డిజిటల్ గోల్డ్‌ను నియంత్రించడం లేదని సెబీ స్పష్టం చేసింది. కానీ బంగారానికి సంబంధించిన కొన్ని ఉత్పత్తులు మాత్రం నేరుగా దాని పర్యవేక్షణలో ఉంటాయని పేర్కొంది.

Also Read: Zodiac Signs: కర్ణుడి ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఈ రాశుల‌వారిలోనే ఉంటాయ‌ట‌!

  1. మ్యూచువల్ ఫండ్స్ అందించే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (Gold ETFs)
  2. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGRs)

పై రెండు ఉత్పత్తులన్నీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడ్ చేయబడతాయి. ఇవన్నీ సెబీ చట్టాల పరిధిలో నడుస్తాయి.

డిజిటల్ గోల్డ్‌లో ప్రమాదాలు ఏమిటి?

డిజిటల్ గోల్డ్ అతిపెద్ద సమస్య ఏమిటంటే ఇందులో ఎలాంటి ప్రభుత్వ భద్రత ఉండదు. ఒకవేళ ఆ ప్లాట్‌ఫామ్ మూసివేయబడినా లేదా ఏదైనా సాంకేతిక లోపం వచ్చినా మీ డబ్బు నష్టపోయే పెద్ద ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా డిజిటల్ వాలెట్‌లు లేదా ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా బంగారం కొనుగోలు చేసే యువ పెట్టుబడిదారులకు ఈ అవగాహన చాలా అవసరం.

Exit mobile version