GST Rules Changes : ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీఎస్టీ శ్లాబుల సవరణ వల్ల ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్‌లో ఎలాంటి నేరుగా మార్పులు ఉండకపోవచ్చు. ఎందుకంటే, జీఎస్టీ (వస్తువులు, సేవల పన్ను) అనేది పరోక్ష పన్ను. మనం కొనే వస్తువులు, సేవలకు ఇది వర్తిస్తుంది. అంటే, ఈ పన్నును వినియోగదారులే చెల్లిస్తారు. అదే సమయంలో, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రత్యక్ష పన్ను. ఇది ఒక వ్యక్తి లేదా సంస్థ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఈ రెండింటిలో ఏ మార్పులు జరిగినా మరొకదానిపై నేరుగా ప్రభావం చూపదు.
Vladimir Putin : ఉక్రెయిన్‌తో యుద్ధానికి ప్రధాన కారణం చెప్పిన రష్యా అధ్యక్షుడు
కొనుగోలు శక్తిలో మాత్రం ప్రభావం…
అయితే, జీఎస్టీలో మార్పులు పరోక్షంగా మాత్రం ప్రజల కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గితే, ఆ వస్తువుల ధరలు తగ్గుతాయి. దీంతో ప్రజల చేతిలో డబ్బు మిగులుతుంది. ఈ మిగిలిన డబ్బును ప్రజలు ఇతర వస్తువులు లేదా పెట్టుబడులపై ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు, అదనపు ఆదాయం లేదా పెట్టుబడుల ద్వారా కొంతమంది ఆదాయం పెరగవచ్చు. దానివల్ల ఇన్కమ్ ట్యాక్స్ లెక్కింపులో లేదా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
అదే సమయంలో, కొన్ని వస్తువుల ధరలు పెరిగితే, ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇది వారి ఖర్చుల బడ్జెట్‌ను ప్రభావితం చేస్తుంది. అటువంటి సందర్భాలలో, ప్రజల పొదుపు మరియు పెట్టుబడులు కూడా తగ్గవచ్చు. దీనివల్ల వారి మొత్తం ఆదాయంపై పరోక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. కానీ, ఇది సాధారణంగా జరిగే మార్పులు కావు. ఈ మార్పులు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్‌లోని నిబంధనలను నేరుగా మార్చవు.
రాయితీలపై ప్రకటనలు ఉంటాయా?
జీఎస్టీ రేట్ల సవరణ అనేది కేవలం వస్తువులు, సేవల పన్ను నిర్మాణాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన చర్య. దీని లక్ష్యం వినియోగదారులకు వ్యాపారులకు పన్ను భారాన్ని సరళీకృతం చేయడం. మరోవైపు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్‌లో మార్పులు తీసుకురావాలంటే, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ప్రత్యేకంగా ప్రకటనలు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, పన్ను శ్లాబులు, మినహాయింపులు, లేదా సెక్షన్ 80C కింద లభించే రాయితీలను మార్చడం వంటివి.
ముఖ్యంగా, జీఎస్టీ రేట్ల సవరణ జరిగిన తర్వాత కూడా, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ విధానం, గడువులు, నిబంధనలు యథావిధిగానే ఉంటాయి. కాబట్టి, పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక ఆదాయ పన్ను రిటర్నులను పాత నిబంధనల ప్రకారమే దాఖలు చేయవచ్చు. ఒకవేళ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్‌లో ఏదైనా మార్పులు చేయాలని భావిస్తే, అది బడ్జెట్ సెషన్‌లో ప్రత్యేకంగా ప్రకటిస్తుంది. దాని తర్వాత మాత్రమే ఆ మార్పులు అమల్లోకి వస్తాయి. కాబట్టి జీఎస్టీ శ్లాబుల సవరణ వల్ల ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో ఎటువంటి మార్పులూ ఉండవని నిశ్చయంగా చెప్పవచ్చు.
NTR-Neel : ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా నుంచి బయటకొచ్చిన సర్ప్రైజ్..!