Site icon HashtagU Telugu

Rs 20 Notes: రూ. 20 నోట్లు మార‌బోతున్నాయా? పాత‌వి చెల్ల‌వా?

Rs 20 Notes

Rs 20 Notes

Rs 20 Notes: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) త్వరలో మహాత్మా గాంధీ సిరీస్ కింద 20 రూపాయల (Rs 20 Notes) కొత్త నోట్లను విడుదల చేయనుంది. ఈ నోట్లపై RBI కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకాలు ఉంటాయి. ఈ కొత్త నోట్ల డిజైన్, ఫీచర్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్న 20 రూపాయల నోట్ల మాదిరిగానే ఉంటాయి. కేవలం సంతకాలను మాత్రమే అప్‌డేట్ చేస్తారు. అంటే రంగు, పరిమాణం, సెక్యూరిటీ ఫీచర్లు అన్నీ ఒకేలా ఉంటాయి. RBI గవర్నర్ మారిన తర్వాత ఈ మార్పు ఒక సాధారణ ప్రక్రియ.

పాత 20 రూపాయల నోట్ల సంగ‌తేంటి?

సంజయ్ మల్హోత్రా 2024 డిసెంబర్ 11న మూడేళ్ల పదవీకాలం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ 26వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. న్యూస్ ఏజెన్సీ ANI నివేదిక ప్రకారం.. గత గవర్నర్ల పదవీకాలంలో విడుదలైన అన్ని ప్రస్తుత 20 రూపాయల బ్యాంక్ నోట్లు చలామణిలో ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. RBI చట్టం, 1934 నిబంధనల ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన అన్ని నోట్లు చలామణి నుంచి వెనక్కి తీసుకోనంత వరకు భారతదేశంలో లావాదేవీల కోసం పూర్తిగా చెల్లుబాటు అవుతాయి.

Also Read: Kidney Stones: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే కిడ్నీలో రాళ్ల సమస్య మొదలైనట్టే!

అంతేకాకుండా భారత ప్రభుత్వం విడుదల చేసిన 1 రూపాయి నోటు కూడా చట్టబద్ధమైన చెల్లుబాటు (లీగల్ టెండర్). బ్యాంక్ నోట్ల ముద్రణ పని నాలుగు ప్రింటింగ్ ప్రెస్‌లలో జరుగుతుంది. వీటిలో రెండు భారత ప్రభుత్వం భారతీయ సెక్యూరిటీ ప్రింటింగ్, కరెన్సీ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ముద్రిస్తారు.

పాత నోట్లను మార్చాల్సిన అవసరం లేదు

ఈ 20 రూపాయల నోటులో మహాత్మా గాంధీ చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా నంబరింగ్ ప్యాటర్న్, వాటర్‌మార్క్, సెక్యూరిటీ థ్రెడ్‌ను కూడా బలోపేతం చేస్తారు. దీని విడుదలతో పాటు మార్కెట్‌లో లావాదేవీల కోసం పాత, కొత్త నోట్లను ఉపయోగించవచ్చు. కొత్త నోట్లు వచ్చిన తర్వాత కూడా పాత నోట్లను మార్చడం లేదా బ్యాంక్‌లో జమ చేయడం అవసరం లేదు. కొత్త నోట్ల పంపిణీ బ్యాంకులు, ATMల ద్వారా జరుగుతుంది.

Exit mobile version