Anant Ambani Wedding : అనంత్ పెళ్లికి రండి.. సీఎంకు ముకేష్ అంబానీ శుభలేఖ

పారిశ్రామిక దిగ్గజం ముకేష్ అంబానీ ఇవాళ మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను కలిశారు.

Published By: HashtagU Telugu Desk
Anant Ambani Wedding

Anant Ambani Wedding : పారిశ్రామిక దిగ్గజం ముకేష్ అంబానీ ఇవాళ మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను కలిశారు. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ శుభలేఖను సీఎం షిండేకు ముకేష్ అంబానీ అందించారు. జులై 12న జరగనున్న అనంత్ వివాహానికి తప్పకుండా హాజరుకావాలని సీఎంను కోరారు. ఈసందర్భంగా సీఎం షిండేను కలిసి వారిలో ముకేష్ అంబానీతో పాటు అనంత్ అంబానీ, వధువు రాధికా మర్చంట్ ఉన్నారు. వీరంతా కలిసి సీఎం షిండే దంపతులకు పెళ్లి పత్రికను అందజేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ప్రముఖ వార్తా సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేసింది. అంతకుముందు తన అధికారిక నివాసానికి చేరుకున్న పారిశ్రామిక దిగ్గజం ముకేష్ అంబానీకి పుష్పగుచ్ఛం అందించి సీఎం ఏక్‌నాథ్ షిండే సాదర స్వాగతం పలికారు.

We’re now on WhatsApp. Click to Join

ఇటీవలే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌లు క్రూయిజ్‌లో రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకను నిర్వహించారు. ఇందులో అంబానీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు 1,200 మంది అతిథులు పాల్గొన్నారు. ఇక అనంత్ వివాహ ఘట్టం జులై 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ఉన్న ప్రతిష్టాత్మకమైన జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ వేడుక(Anant Ambani Wedding) కూడా ఎంతో అట్టహాసంగా జరగనుంది.

అంబానీ, కపూర్ కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే రణబీర్‌, ఆలియా..  అంబానీలు నిర్వహించే ప్రతీ చిన్నా పెద్దా ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. అనంత్- రాధికల రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక ముగిసినా సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవలే ఇటలీలో జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు  సంబంధించిన కొన్ని ఫొటోలలను తాజాగా ఆలియా భట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ  ఫోటోలలో నటి ఆలియా పౌడర్ బ్లూ గౌనులో కనిపిస్తోంది. రణబీర్ కపూర్ చేయి పట్టుకుని అలియా నడుస్తూ ఆ ఫొటోలో ఉన్నారు. రణ్ బీర్ కూడా చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు. ముఖానికి మాస్క్ వేసుకుని ఆయన స్టైలిష్ గా ముస్తాబయ్యారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  Last Updated: 26 Jun 2024, 01:31 PM IST