Diktat For Employees : ఆఫీసు టైంలో ఉద్యోగులు కాఫీ, టీ తాగడానికి బయటికి వెళ్లిరావడం అనేది సర్వసాధారణమైన విషయం. చాలా పెద్ద కంపెనీలు ఉద్యోగులకు తమ ఆఫీసులోనే కాఫీ, టీ వసతిని కల్పిస్తుంటాయి. అంతేకాదు.. ఇంకా సౌకర్యాలను తమ ఉద్యోగులకు సమకూరుస్తాయి. అయితే ఓ కంపెనీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై వర్కింగ్ టైంలో కాఫీ తాగేందుకు ఆఫీసు బయటకు వెళ్లొద్దని తమ ఉద్యోగులకు ఆర్డర్ జారీ చేసింది.దీంతో ఆ ఉద్యోగులంతా షాక్‌కు(Diktat For Employees) గురయ్యారు. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
మినరల్ రిసోర్సెస్ అనే కంపెనీ ఆస్ట్రేలియా కేంద్రంగా పనిచేస్తుంటుంది. ఇది మైనింగ్ రంగంలో కార్యకలాపాలు సాగిస్తోంది.ఈ కంపెనీలో పెద్దసంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో చాలామంది రోజూ పనిగంటల టైంలో కాఫీ/టీ కోసం బయటికి వెళ్లొచ్చేవారు. అయితే దీనివల్ల వారి వర్కింగ్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని గుర్తించారు. ఈనేపథ్యంలో మినరల్ రిసోర్సెస్ కంపెనీ ఎండీ క్రిస్ ఎలిసన్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఉద్యోగుల కోసం కొత్త రూల్స్‌ను విడుదల చేశారు. ఉద్యోగులు వర్కింగ్ హవర్స్‌లో కాఫీ కోసం బయటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. పని గంటల టైంలో ఉద్యోగులు బయటికి వెళ్లడం వల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోయి కంపెనీకి నష్టం జరుగుతోందని తెలిపింది. దీంతో ఆ ఉద్యోగులంతా ఇక రూల్ ప్రకారం నడుచుకుంటున్నారు.
ఈ కాలంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు ఆఫీసులోనే సకల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఇలాంటి టైంలో ఈవిధమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల అలాంటి కంపెనీలలోకి అత్యంత నిపుణులైన ఉద్యోగులు చేరేందుకు ఆసక్తి చూపకపోవచ్చని చెబుతున్నారు. ఫలితంగా దీర్ఘకాలంలో నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. కాఫీ తాగేందుకు ఆఫీసు బయటకు వెళ్లొద్దని ఉద్యోగులకు ఆర్డర్స్ ఇచ్చే క్రమంలో.. వారికి ఆఫీసులోనే ఆ వసతిని కల్పించడంపై ఫోకస్ చేస్తే బాగుండేదని నిపుణులు సూచిస్తున్నారు.