Minimum Balance : ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా లేనివారు ఉండడం అరుదు. చాలా మందికి ఏదో ఒక బ్యాంకులో ఖాతా ఉంటుంది. సేవింగ్స్ ఖాతాను తెరిచి, అందులో కొంత మొత్తాన్ని ఉంచి, లావాదేవీలు చేస్తుంటారు. కానీ, ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది దేశీయ ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంక్. తాజాగా, తమ బ్యాంకులో కొత్త ఖాతాలు తెరిచే వారికి, అలాగే పాత ఖాతాదారులకు కొన్ని నియమ నిబంధనలను సవరించింది. కొన్ని రకాల సేవింగ్స్ ఖాతాలకు కనీస బ్యాలెన్స్ పరిమితిని పెంచింది.
ఆగస్టు 1 నుంచి అమల్లోకి కొత్త నిర్ణయం..
కొత్తగా ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఖాతాను ఓపెన్ చేసే వారికి, రూ.50,000 తప్పనిసరి అని పేర్కొంది. ఈ నిబంధన ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని కూడా బ్యాంకు తెలిపింది. అంటే, ఆగస్టు 1 నుంచి ఎవరైనా కొత్తగా ఖాతా తెరిస్తే, కనీసం రూ.50,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ 50 వేల రూపాయలను వారి ఖాతాలో ఎప్పుడూ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేయకపోతే, బ్యాంకు వారి నుంచి ఛార్జీలను వసూలు చేస్తుంది. పాత ఖాతాదారులకు మాత్రం ఇది వర్తించదు.
Traffic Alert: హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: వార్-2 ఈవెంట్‌తో యూసుఫ్‌గూడలో రూట్ మార్పులు
పాత ఖాతాదారులకు వర్తించదు
అలాగే, పాత ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్ నిబంధనలను మాత్రం అలాగే ఉంచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి రూ.5,000, పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి రూ.10,000 కనీస బ్యాలెన్స్ గా ఉండాల్సిందేనని తెలిపింది. ఇదివరకు ఏ నియమాలు ఉన్నాయో, అవే కొనసాగుతాయని బ్యాంకు స్పష్టం చేసింది. అయితే, ఇవి కేవలం రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాలకు మాత్రమేనని కూడా తెలిపింది. అలాగే, ఈ కొత్త రూ.50,000 డిపాజిట్ అనేది అన్ని రకాల ఖాతాలకు కాదని, కొన్ని రకాల ఖాతాలకు మాత్రమే వర్తిస్తుందని వివరించింది.
ఈ కొత్త నిబంధనలు ‘బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్’ (BSBDA)కు వర్తించవని బ్యాంక్ స్పష్టం చేసింది.ఈ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సిన అవసరం లేదు.పేద,మధ్య తరగతి ప్రజలు, అలాగే వేతన జీవుల కోసం ఈ ఖాతాలను తెరిచింది. ఇందులో ఎంత డబ్బు ఉన్నా, ఎటువంటి ఛార్జీలు పడవు. అలాగే, సున్నా బ్యాలెన్స్ ఉన్నా కూడా ఎలాంటి ఛార్జీలు విధించరు.
ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త నియమ నిబంధనలపై ఖాతాదారుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఈ నిర్ణయాన్ని తప్పుబడుతుండగా, మరికొందరు ఇది బ్యాంకుకు మంచిదేనని అంటున్నారు. ఈ నిర్ణయం బ్యాంకు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి, మంచి ఖాతాదారులను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది అని నిపుణులు అంటున్నారు. ఈ కొత్త నియమాలు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, మీరు ఐసీఐసీఐ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు. ఈ కొత్త నిబంధనల గురించి మీ అభిప్రాయం ఏమిటి?
World Lion Day 2025 : సింహాలు ప్రతిరోజు ఎన్ని కేజీల మాంసం తింటాయో తెలుసా..?