Site icon HashtagU Telugu

Tata Group Next Generation: ఇప్పుడు ఇదే ప్ర‌శ్న‌.. ర‌త‌న్ టాటా వార‌సులు ఎవ‌రూ..?

Tata Group Next Generation

Tata Group Next Generation

Tata Group Next Generation: దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు. ఈ వార్త దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో గత అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానంతరం టాటా గ్రూప్ వారసుడు (Tata Group Next Generation) ఎవరనే చర్చ మొదలైంది. టాటా గ్రూప్‌ను 150 సంవత్సరాల క్రితం జమ్‌సెట్జీ నౌషర్జీ టాటా స్థాపించారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో 100 కంటే ఎక్కువ కంపెనీలు ఉన్నాయి. దీని టర్నోవర్ రూ. 3800 కోట్ల కంటే ఎక్కువ. ఇటీవలే టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను కూడా కొనుగోలు చేసింది.

Also Read: Ratan Tata Net Worth: మ‌ర‌ణించే స‌మ‌యానికి రతన్ టాటా సంపాద‌న ఎంతో తెలుసా..?

ర‌త‌న్ టాటా వార‌సులు వీరేనా

ర‌త‌న్ టాటా బ్రహ్మచారి. పెళ్లి లేదు, పిల్లల్లేరు. అపారమైన ఆస్తులున్న ఆ గ్రూపు వారసత్వ పగ్గాలు ఎవరు చేపడతారనేది ఆసక్తికరమైన ప్రశ్న. ఆయన సవతి సోదరుడు నోయల్ నావెల్‌కు ముగ్గురు పిల్లలు. లియా, మాయా, నెవిల్లే. వీరిలో లియా, మాయా ఆడపిల్లలు, నెవిల్లే పురుషుడు. ప్రస్తుతం టాటా గ్రూపులోనే వివిధ బాధ్యతల్లో ఉన్నారు. టాటా వీలునామాలో ఎలా ఉంటే వారికే పగ్గాలు ద‌క్కుతాయి. బిజినెస్ సర్కిళ్లలో మాయా టాటా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. టాటా గ్రూపులో అధికశాతం షేర్లు ఆ గ్రూపుకి చెందిన చారిటబుల్ ట్రస్టుల పేర్లతో ఉన్నాయి. ఆయన పేరిట ఉన్న షేర్లకు వారసులు ఎవరనేదే ప్రశ్న.

నోయెల్ టాటా పెరుగుతున్న వయస్సును పరిగణనలోకి తీసుకుంటే తదుపరి తరం నుండి ఎవరికైనా పగ్గాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మాయ, నెవిల్లే, లియా ఈ ముగ్గురూ తమను తాము నిరూపించుకుంటున్నారు. టాటా గ్రూప్‌లో సాధారణ ఉద్యోగిగా ప్రారంభించి కష్టపడి ముందుకు సాగుతున్నారు. 34 ఏళ్ల మాయ టాటా డిజిటల్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. 32 ఏళ్ల నెవిల్లే హైపర్‌మార్కెట్ చైన్ స్టార్ బజార్‌ను నిర్వహిస్తున్నారు. 39 ఏళ్ల లియా హాస్పిటాలిటీ రంగాన్ని చూసుకుంటుంది. ప్రస్తుతం చంద్రశేఖరన్ టాటా సన్స్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.