McDonald’s : హైదరాబాద్లో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్

McDonald's : ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు రానుండగా, ప్రత్యక్షంగా 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి

Published By: HashtagU Telugu Desk
Mcdonald's Global Office In

Mcdonald's Global Office In

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మెక్డొనాల్డ్స్ (McDonald’s ) తన గ్లోబల్ ఆఫీస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించబడింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth ), మెక్డొనాల్డ్స్ సీఈఓ క్రిస్ కెమ్కిన్స్కి(McDonald’s CEO Chris Kempczinski)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు రానుండగా, ప్రత్యక్షంగా 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Chandrababu : రేపు తిరుమలకు సీఎం చంద్రబాబు

ప్రస్తుతం తెలంగాణలో 38 మెక్డొనాల్డ్స్ అవుట్‌లెట్లు ఉండగా, రాబోయే సంవత్సరాల్లో ప్రతి ఏడాది 3-4 కొత్త అవుట్‌లెట్లను ప్రారంభించనున్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, సేవా రంగంలో ఉద్యోగ అవకాశాలను పెంచనుంది. అంతేకాకుండా హైదరాబాద్‌ ఐటీ రంగం, వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి వాణిజ్య కేంద్రంగా ఎదుగుతుండటం మెక్డొనాల్డ్స్‌ను ఆకర్షించిన ప్రధాన కారణంగా చెబుతున్నారు.

Corona : కరోనా కంటే కాంగ్రెస్ వైరస్ ప్రమాదం – కేటీఆర్

ఈ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్ర రైతులకు కూడా లాభం కలుగనుంది. మెక్డొనాల్డ్స్ కార్యకలాపాలకు అవసరమైన తాజా వ్యవసాయ ఉత్పత్తులను తెలంగాణ రైతులు సరఫరా చేయనున్నారు. ఇది రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కొత్త అవకాశాలు తెచ్చిపెట్టడంతో పాటు, రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా మద్దతుగా నిలుస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రపంచ స్థాయి బ్రాండ్ అయిన మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్‌లో స్థిరపడటం తెలంగాణకు మరింత ప్రతిష్ట తెచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.

  Last Updated: 19 Mar 2025, 09:33 PM IST