WhatsApp Sale: వాట్సాప్‌ను నిత్యం మనమంతా వినియోగిస్తుంటాం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈతరం కాలం గడిపేస్తుంటారు. ఈ రెండు యాప్స్ ప్రస్తుతం మెటా (ఫేస్‌బుక్) అధినేత మార్క్ జుకర్‌బర్గ్ చేతిలో ఉన్నాయి. ఈయన ఒక అమెరికన్. అమెరికాలో టెక్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. టెక్నాలజీతో అమెరికా ప్రయోజనాలు దెబ్బతింటాయని చిన్న డౌట్ వచ్చినా.. లెక్కలన్నీ బయటికి తీస్తారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టెక్ కంపెనీ యజమానిని అందరి ముందు కూర్చోబెట్టి ప్రశ్నలు సంధిస్తారు. అవసరమైన సమాధానాలన్నీ రాబడతారు. డౌట్స్ క్లియర్ అయ్యేదాకా సవాలక్ష సందేహాలన్నీ అడుగుతారు. దీన్నే లీగల్ భాషలో ‘యాంటీ ట్రస్ట్ ట్రయల్’ అంటారు. ప్రస్తుతం అమెరికాలో అతిపెద్ద యాంటీ ట్రస్ట్ ట్రయల్‌ను ఎదుర్కొంటున్న కంపెనీ.. మెటా (ఫేస్‌బుక్). దీని పరిధిలోనే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఉన్నాయి. ఈ రెండు కీలక యాప్స్‌ను జుకర్ బర్గ్ అమ్మేసే రేంజులో ఈరోజు(ఏప్రిల్ 14) సాయంత్రం నుంచే ‘యాంటీ ట్రస్ట్ ట్రయల్’ జరగబోతోందట. జడ్జి జేమ్స్ బోస్‌బర్గ్ సారథ్యంలో ఈ విచారణ జరగనుంది.
Also Read :Blatant Mistake: షాకింగ్ పోలీసింగ్.. నిందితుడి బదులు జడ్జిని వెతికిన ఎస్సై
యాంటీ ట్రస్ట్ ట్రయల్ వర్సెస్ జుకర్‌బర్గ్.. ఏం జరగొచ్చు ?
- గతంలో మెటా(WhatsApp Sale)లో పనిచేసిన ఒక ఉద్యోగిని ఇటీవలే మార్క్ జుకర్‌బర్గ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. చైనా ప్రభుత్వంతో జుకర్‌బర్గ్‌కు రహస్య డీల్స్ ఉన్నాయని ఆమె ఆరోపించారు. చైనా ప్రయోజనాలకు అనుగుణంగా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను జుకర్ బర్గ్ నడుపుతున్నారని ఆరోపణ చేశారు.
- మెటా(ఫేస్‌బుక్)పై 37 రోజుల పాటు యాంటీ ట్రస్ట్ ట్రయల్ జరుగుతుందట.
- ఈ సుదీర్ఘ విచారణ జరిగే క్రమంలో మెటాపై అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (US FTC) వివిధ రకాల ప్రశ్నలన్నీ అడగనుంది.
- సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్ మార్కెట్లలో మెటా కంపెనీ గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించేలా ఉండే అంశాలను అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ లేవనెత్తే ఛాన్స్ ఉంది.
- ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లను అమెరికాలోని ఇతర టెక్ కంపెనీలకు అమ్మేసేలా మెటాను పలు ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది.
- ‘‘పోటీ పడడం కంటే వాటిని కొనడమే ఉత్తమం’’ అంటూ జుకర్‌బర్గ్ గతంలో చేసిన ఒక మెసేజ్‌పై వివరణ కోరేందుకు అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ రెడీ అవుతోందట.
Also Read :Kidney Stones: కిడ్నీలో రాళ్ల సమస్య.. షాకింగ్ విషయాలు వెలుగులోకి
కోర్టు మెట్లు ఎక్కిన మెటా
ఇక ఈ ‘యాంటీ ట్రస్ట్ ట్రయల్’పై కోర్టును మెటా ఆశ్రయించింది. తమ కంపెనీ పెట్టుబడులు పెట్టకపోయి ఉంటే, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లకు ఇంత ఆదరణ వచ్చేదే కాదని మెటా న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒకవేళ కోర్టు ఉత్తర్వులు మెటాకు వ్యతిరేకంగా వస్తే, తదుపరిగా అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తీసుకునే నిర్ణయాలు కీలకం అవుతాయి. ప్రస్తుతం మెటా(ఫేస్ బుక్) కంపెనీ ఆదాయంలో 50శాతం ఇన్‌స్టాగ్రామ్ నుంచే వస్తోంది.