Failure Story : ‘‘అతి సర్వత్రా వర్జయేత్’’ అన్నారు మన పెద్దలు. బిలియనీర్ నుంచి బికారీ దాకా ఎవరికైనా ఈ హితోక్తి వర్తిస్తుంది. దీన్ని పట్టించుకోకుండా ఏదైనా ‘అతి’ వ్యవహారం చేస్తే బిలియనీర్ అయినా సరే అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఇందుకు తాజా నిదర్శనం ప్రమోద్ మిట్టల్. ఈయన ఎవరో తెలుసా ? ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్ సోదరుడే ఈ ప్రమోద్ మిట్టల్. కూతురి పెళ్లికి ఏకంగా రూ.550 కోట్లు ఖర్చు చేసిన ఈయన అప్పుల ఊబిలో ఎలా కూరుకుపోయారు ? అనేది తెలుసుకుందాం..
Also Read :Jagga Reddy : యాక్టర్‌గా జగ్గారెడ్డి.. ప్రేమ కథా చిత్రంలో కీలక పాత్ర
ప్రమోద్ మిట్టల్ ఫెయిల్యూర్ స్టోరీ
- ప్రస్తుతం బ్రిటన్ రాజధాని లండన్‌లోని మే ఫెయిర్ ఏరియాలో ప్రమోద్ మిట్టల్ ఉంటున్నారు. ఆయన నివాసంలో తండ్రి, భార్య, కుమారుడు, బావ మరిది ఉంటారు.
- ఒకప్పుడు స్టీల్ తయారీ వ్యాపారంలో ప్రమోద్ కూడా ఓ వెలుగు వెలిగారు.
- ‘స్టీల్ మాగ్నెట్’ లక్ష్మీ మిట్టల్ సోదరుడు కావడంతో ఈయనకు మంచి పరపతి ఉండేది.
- లక్ష్మీ మిట్టల్, ప్రమోద్ మిట్టల్, వినోద్ మిట్టల్‌ల తండ్రి పేరు మోహన్ లాల్ మిట్టల్.
- 1984లో భారత్‌లో నిప్పన్ డెన్రో ఇస్పత్ లిమిటెడ్ అనే కంపెనీని మోహన్ లాల్ మిట్టల్ స్థాపించారు.
- 1994లో ఈ కంపెనీ కార్యకలాపాలను మోహన్ లాల్ మిట్టల్ ముగ్గురు కుమారులు పంచుకున్నారు.
- నిప్పన్ డెన్రో ఇస్పత్ లిమిటెడ్ అంతర్జాతీయ వ్యాపార విభాగాన్ని లక్ష్మీ మిట్టల్ తీసుకున్నారు. కంపెనీకి భారత్‌లో ఉన్న స్టీల్, ఇతరత్రా వ్యాపారాలను ప్రమోద్ మిట్టల్, వినోద్ మిట్టల్ తీసుకున్నారు.
- 2004లో ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన గ్లోబల్ స్టీల్ ఫిలిప్పీన్స్‌ను ప్రమోద్ కొన్నారు. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్టీల్ కర్మాగారం.
- 2006 సంవత్సరంలో బోస్నియా అండ్ హెర్జ్ గొవీనా దేశంలోకి కూడా తన వ్యాపార కార్యకలాపాలను ప్రమోద్ విస్తరించారు. అయితే ఈసారి ఆయన బొగ్గు వ్యాపారంలోకి ఎంటర్ అయ్యారు. స్టీల్ తయారీ ప్లాంట్లకు బొగ్గు చాలా అవసరం. ఈ అవసరాన్ని తీర్చుకునేందుకే బొగ్గు బిజినెస్‌లోకి ప్రమోద్ ఎంట్రీ ఇచ్చారు.
- బోస్నియా అండ్ హెర్జ్ గొవీనాలో ఉన్న బొగ్గు ఉత్పత్తి సంస్థ ‘జికిల్’ (GIKIL) అప్పుల ఊబిలో ఉంది. ఆ కంపెనీ అప్పులకు తాను పూచీకత్తు ఇస్తానని ప్రమోద్ అత్యుత్సాహంతో ప్రకటించారు. దానిపై జికిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
- అయితే ‘జికిల్’ (GIKIL) అప్పుల భారంతో దివాలా తీసింది. అప్పులను తిరిగి చెల్లించలేక చతికిల పడింది.చివరకు ఈ కంపెనీ దివాలా తీసిందని కోర్టులు తీర్పు ఇచ్చాయి. దీంతో అది చిల్లిగవ్వ కూడా చెల్లించలేదని తేలిపోయింది. ఈ పరిణామమే ప్రమోద్‌కు షాక్ ఇచ్చింది. ఆయన అంచనాలు తలకిందులు అయ్యాయి.
- ‘జికిల్’ (GIKIL) కంపెనీ దివాలా కేసుపై ఏళ్ల తరబడి న్యాయ విచారణ జరిగింది.
- తమకు తండ్రి నుంచి వచ్చిన వ్యాపారాన్ని 2012లో ప్రమోద్ మిట్టల్, వినోద్ మిట్టల్‌లు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు అమ్మేశారు. ఆ సమయానికి వీరి కంపెనీ పేరు ఇస్పత్ స్టీల్ లిమిటెడ్ (ISL). ప్రస్తుతం ఈ కంపెనీ పేరు జేఎస్‌డబ్ల్యూ ఇస్పత్ స్టీల్.
- ఓ వైపు ‘జికిల్’ (GIKIL) కంపెనీ దివాలా కేసు నడుస్తుండగానే 2013లో తన కుమార్తె సృష్టి మిట్టల్‌కు ప్రమోద్ పెళ్లి చేశారు. ఈ మ్యారేజ్ కాస్ట్ అక్షరాలా రూ.550 కోట్లు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఈ పెళ్లి జరిగింది. రుచికరమైన వంటకాలు, విస్తారమైన అలంకరణలు, హైప్రొఫైల్ అతిథులతో అట్టహాసంగా ఈ వేడుక జరిగింది.
- కట్ చేస్తే, 2019లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బోస్నియా అండ్ హెర్జ్ గొవీనా దేశంలోని తుజ్లా ప్రాంతంలో ఉన్న కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ‘‘ప్రమోద్ మిట్టల్ వల్లే జికిల్ నష్టపోయింది. అందుకుగానూ నష్టపరిహారంగా రూ.100 కోట్లు కట్టాలి’’ అని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ మొత్తాన్ని చెల్లించలేనని ప్రమోద్ చేతులు ఎత్తేశారు.
- ప్రమోద్ మిట్టల్(Rs 550 Crores Marriage) దివాలా తీశారని 2020 జూన్ 19న లండన్‌లోని ఓ కోర్టు కీలక తీర్పును ఇచ్చింది.
Also Read :Buddha Vs KTR : కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. బుద్ధా వెంకన్న వార్నింగ్
అనిల్ అంబానీలాగే..
- నిశితంగా పరిశీలిస్తే.. ప్రమోద్ మిట్టల్ ఫెయిల్యూర్ స్టోరీ అచ్చం అనిల్ అంబానీ స్టోరీలాగే అనిపిస్తుంది. రెండుచోట్లా చాలా అంశాలు సేమ్ టు సేమ్ అనిపిస్తాయి.
- అనిల్ అంబానీలాగే మిట్టల్ మితిమీరిన అప్పులు చేశారు.
- తిరిగి చెల్లించే సామర్థ్యానికి మించిన అప్పులు డేంజర్ అని మనం అర్థం చేసుకోవాలి.
- అప్పులు పెరిగిపోతే ఎంతటి వాళ్లయినా దివాలా తీస్తారని గుర్తుంచుకోవాలి. మరోవైపు ప్రమోద్ సోదరుడు లక్ష్మీ మిట్టల్ ఆర్థికంగా బలంగానే ఉన్నాడు.
- ప్రమోద్ మిట్టల్ ఆర్భాటానికి పోయి కూతురి పెళ్లిలో డబ్బులు దుబారా చేశాడు.భవిష్యత్తు గురించి ఆలోచించలేదు.
- మునిగిపోతున్న కంపెనీ అప్పులకు గ్యారంటీ ఇవ్వడం ప్రమోద్ మిట్టల్ చేసిన పెద్ద తప్పు. నష్టాల్లో ఉన్న నావను అస్సలు పట్టుకోవద్దు. మునిగిపోయే నావ మనల్ని కూడా ముంచేస్తుంది. ఓడిపోతున్న గుర్రంపై అస్సలు పందెం కాయొద్దు అని పెద్దలు చెబుతుంటారు.
- అనిల్ అంబానీ కూడా కొత్త వ్యాపారాల్లో పాత వ్యూహాలనే అమలు చేశారు. అందుకే అవి అంతగా సక్సెస్ కాలేదు. ఒక వ్యాపారాన్ని బలోపేతం చేయకముందే.. కొత్తకొత్త వ్యాపారాల్లో ప్రవేశించి బోల్తాపడ్డారు. ప్రమోద్ విషయంలోనూ ఇదే జరిగింది.