JioCoin : ముకేశ్ అంబానీ.. ఇప్పుడు భారతదేశ వ్యాపార ప్రపంచంలో రారాజు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏది చేసినా పెద్ద సంచలనమే. అది ఏ రంగంలోకి అడుగుపెట్టినా పెద్ద విప్లవమే. తాజాగా జియో కాయిన్ అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి దీనిపై జియో వైపు నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. ఇంతకీ అదేమిటి ? ఆ కాయిన్ ఎలా పనిచేస్తుంది ? అనే విశేషాలను ఈ కథనంలో చూద్దాం..
Also Read :Xiaohongshu Vs TikTok : టిక్‌టాక్ సైలెంట్.. అమెరికాను ఊపేస్తున్న మరో చైనా యాప్
గూగుల్ క్రోమ్ వర్సెస్ జియో స్పియర్
ఇంటర్నెట్ సెర్చ్ చేసే బ్రౌజర్లలో నంబర్ 1 అంటే గూగుల్ క్రోమ్. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కూడా చాలా ఫేమస్ బ్రౌజర్. ఇప్పుడు వాటిని ఢీకొట్టేందుకు జియో రెడీ అవుతోంది. ఇందుకోసం ‘జియో స్పియర్’ అనే బ్రౌజర్‌ను రెడీ చేసింది. ‘జియో స్పియర్’ బ్రౌజర్‌ను మనం ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ డివైజ్‌లలో పొందొచ్చు. ఆ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి, అకౌంటు క్రియేట్ చేసుకొని, లాగిన్ కావాలి. దానిలో ఇంటర్నెట్‌ను వినియోగించే వారికి జియో కాయిన్లను రివార్డుగా ఇస్తారని తెలుస్తోంది. ‘జియో కాయిన్స్’ అనేవి డిజిటల్ టోకెన్లు. వీటిని జారీ చేయడానికి ఇటీవలే ‘పాలిగాన్’ అనే బ్లాక్ చైన్ టెక్నాలజీ కంపెనీతో ‘జియో ప్లాట్‌ఫామ్స్’ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. జియో కాయిన్స్ జారీ కాగానే ‘పాలీగన్’ కంపెనీకి చెందిన వ్యాలెట్లలో సేవ్ అవుతాయి. ప్రస్తుతానికైతే వీటిని రీడీమ్ చేయలేం, ఇతరులకు బదిలీ చేయలేం.
Also Read :Naga Sadhus : తమకు తామే పిండం పెట్టుకొని నాగ సాధువులైన 1,500 మంది
రానున్న రోజుల్లో జియో కాయిన్లను(JioCoin) రీడీమ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. వాటిని రీడీమ్ చేసుకొని మొబైల్ రీఛార్జులు, జియో ఉత్పత్తుల కొనుగోళ్లు, రిలయన్స్ గ్యాస్ స్టేషన్లలో చెల్లింపులు చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆర్‌బీఐ నుంచి అనుమతులు మంజూరైతే.. జియో కాయిన్ రివార్డు టోకెన్లను కరెన్సీగా మార్చుకునే ఛాన్స్ కూడా ఇస్తారట. జియో కాయిన్లను కరెన్సీగా మార్చుకొని యూపీఐతో లింక్ అయిన బ్యాంకు ఖాతాలోకి పంపుకోవచ్చట.