Jio Payment : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏ రంగంలోకి ప్రవేశించినా పెను విప్లవమే. టెలికాం రంగంలో సత్తాచాటుకున్న రిలయన్స్ జియో ఇప్పుడు ఫిన్‌టెక్ (ఫైనాన్షియల్ సర్వీసుల టెక్నాలజీ)పై ఫోకస్ పెట్టింది. ఈక్రమంలోనే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన జియో పేమెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్ (జేఎస్‌పీఎల్) కీలక ముందడుగు వేసింది. ఆన్‌లైన్ పేమెంట్స్ అగ్రిగేటర్‌గా అవకాశం కల్పించాలంటూ జియో పేమెంట్ సొల్యూషన్స్ చేసుకున్న దరఖాస్తును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదించింది. అక్టోబర్ 28 నుంచే ఈ సర్టిఫికేషన్ చెల్లుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు జియో పేమెంట్ సొల్యూషన్స్ తెలియజేసింది. ఈ నిర్ణయం వెలువడిన నేపథ్యంలో జియో ఫైనాన్షియల్(Jio Payment) షేరు ధర ఎన్‌ఎస్‌ఈలో లాభపడి రూ.323కు చేరుకుంది.
Also Read :Operation ASAN : మేడ్ ఇన్ మెదక్.. ‘బీఎంపీ-2 శరత్’తో ఉగ్రవాదుల ఏరివేత సక్సెస్
ధన్‌తేరస్ అంటేనే బంగారం కొనుగోళ్లు. ఈసందర్భంగా బంగారాన్ని కొనడం శుభప్రదమని హిందువులు భావిస్తుంటారు. ప్రజలు డిజిటల్ రూపంలో గోల్డ్ కొనేందుకు ‘స్మార్ట్ గోల్డ్’ సదుపాయాన్ని జియో ఫైనాన్షియల్ యాప్ తీసుకొచ్చింది. దీన్ని వాడుకొని ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా డిజిటల్ గోల్డ్‌ను ఈజీగా కొనొచ్చు. మినిమం రూ.10కి సమానమైన డిజిటల్ గోల్డ్‌ను కూడా కొనొచ్చు. డిజిటల్ గోల్డ్‌ను క్యాష్ రూపంలోకి, ఫిజికల్ గోల్డ్‌గా మార్చుకునే సదుపాయం సైతం యూజర్లకు ఉంటుంది. దీంతోపాటు మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీలోనూ జియో ఫైనాన్షియల్ కీలక దశకు చేరుకుంది.
Also Read :Electricity Charges : గుడ్ న్యూస్.. కరెంటు ఛార్జీలు పెంచబోం : తెలంగాణ సర్కారు
అమెరికాకు చెందిన ప్రఖ్యాత కంపెనీ బ్లాక్‌రాక్‌తో కలిసి రెండు జాయింట్ వెంచర్ కంపెనీలను జియో ఏర్పాటు చేసింది. వాటి పేర్లు.. జియో బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్, జియో బ్లాక్‌రాక్ ట్రస్టీ. దీనికి సంబంధించిన సర్టిఫికేషన్‌ను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి రెండు కంపెనీలు అందుకున్నాయి. తదుపరిగా ఈ రెండు కంపెనీలు మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని మొదలు పెట్టనున్నాయి. జియో, బ్లాక్ రాక్ రెండు కూడా ప్రఖ్యాత కంపెనీలే కావడంతో మ్యూచువల్ ఫండ్లకు భారీ క్రేజ్ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.