Forceful Layoffs : ఇన్ఫోసిస్.. మన దేశంలోని టాప్-3 ఐటీ కంపెనీల్లో ఒకటి. ఈ కంపెనీకి కర్ణాటకలోని మైసూరులో ఒక క్యాంపస్ ఉంది. ఇందులో పనిచేస్తున్న దాదాపు 400 మంది ట్రైనీ ఉద్యోగులను ఫిబ్రవరి మొదటివారంలో విధుల్లో నుంచి తొలగించడంపై దుమారం రేగింది. వారిని బలవంతంగా విధుల నుంచి తప్పించారనే ఆరోపణలు వినిపించాయి. చివరకు ఈ వ్యవహారం ప్రధానమంత్రి ఆఫీసు(పీఎంఓ) దాకా చేరింది. తమను ఇన్ఫోసిస్ కంపెనీ బలవంతంగా జాబ్స్ నుంచి తొలగించింది అంటూ వారు పీఎంఓకు కంప్లయింట్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై పీఎంఓకు 100కుపైగా కంప్లయింట్స్ వెళ్లాయట.
Also Read :Sea Color : ఏపీలో సముద్రం రంగు ఎందుకు మారుతోంది ? కారణాలివీ
కేంద్రం స్పందన..
‘‘ఈ విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలి. మా ఉద్యోగాలను(Forceful Layoffs) తిరిగి ఇప్పించాలి. భవిష్యత్తులో ఇలాంటి తొలగింపులు జరగకుండా చూడాలి’’ అని ఫిర్యాదుల్లో ట్రైనీలు కోరారంటూ జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. పీఎంఓకు ఈ ఫిర్యాదులు అందిన తర్వాతే కేంద్ర కార్మిక శాఖ స్పందించింది. దీనికి సంబంధించి కర్ణాటక రాష్ట్ర కార్మిక శాఖకు ఫిబ్రవరి 25వ తేదీనే కేంద్ర కార్మిక శాఖ నోటీసులను పంపింది. రాష్ట్ర కార్మిక శాఖ అధికారులు దర్యాప్తు జరిపి కేంద్రానికి నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది.
Also Read :Shah Rukh Khan: ‘మన్నత్’ నుంచి అద్దె ఇంట్లోకి షారుఖ్.. ఎందుకో తెలుసా ?
ఇన్ఫోసిస్ వివరణ ఇదీ
400 మంది ట్రైనీల తొలగింపుపై ఇప్పటికే ఇన్ఫోసిస్ వివరణ విడుదల చేసింది. ‘‘వరుసగా మూడు ఎవాల్యుయేషన్ పరీక్షల్లో వాళ్లు విఫలమయ్యారు. అందుకే వారిని తొలగించాం. ఈ పరీక్షలు మా సంస్థ నిబంధనల్లో భాగం. కంపెనీ పురోగతికి అవి చాలా ముఖ్యం’’ అని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది.
400 మంది ఎవరు ?
- 2022-23లో దాదాపు 2000 మంది ఫ్రెషర్లను సిస్టమ్ ఇంజినీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ తదితర పోస్టుల కోసం ఇన్ఫోసిస్ ఎంపిక చేసుకుంది.
- వాళ్లందరికీ అప్పుడే ఆఫర్ లెటర్లను ఇచ్చేసింది.
- ఆ 2వేల మంది ఫ్రెషర్లు 2022లో బీటెక్ పూర్తిచేసిన వారు.
- 2వేల మందికి ఆఫర్ లెటర్లు ఇచ్చినా, వెంటనే విధుల్లోకి తీసుకోలేదు. వారికి అపాయింట్‌మెంట్ లెటర్లను ఇవ్వడంలో ఇన్ఫోసిస్ జాప్యం చేసింది.
- దీంతో అప్పట్లో ఇన్ఫోసిస్‌పై విమర్శలు వచ్చాయి. కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు కూడా వెళ్లింది.
- దీంతో ఎట్టకేలకు 2024 ఏప్రిల్‌లో 2వేల మందిని ఇన్ఫోసిస్ జాబ్స్‌లోకి తీసుకుంది.
- ఈక్రమంలోనే 2024లో కర్ణాటకలోని మైసూరు ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో ట్రైనీలుగా చేరిన వారిలో 400 మందిపై ఇన్ఫోసిస్ వేటు వేసింది.