Site icon HashtagU Telugu

Rupee Vs Dollar : మన రూపాయి ఎందుకు డీలా పడుతోంది ? అమెరికా డాలరుతో లింకేంటి ?

Rupee Vs Dollar Indian Rupee Fall Us Dollar

Rupee Vs Dollar : భారత రూపాయి పతనం ఎంతకూ ఆగడం లేదు. అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి మారకం విలువ క్రమంగా డౌన్ అవుతూ ఇటీవలే రూ.85కు చేరింది. అంటే ఒక అమెరికా డాలరు కోసం మనం 85 రూపాయల్ని ఇవ్వాల్సి వస్తోందన్న మాట. పరిస్థితులు అమెరికా డాలరుకు అత్యంత అనుకూలంగా ఉన్నాయని, దానిదే పైచేయిగా ఉందని ఈ లెక్కలను బట్టి స్పష్టమవుతోంది. ఒక డాలరు కోసం మనం రూ.85 చెల్లించాల్సి రావడం అనేది జీవిత కాల కనిష్ఠ స్థాయి. ఇంతకుముందు ఎన్నడూ ఈ రేటును మనం చెల్లించనే లేదు.  నరేంద్రమోడీ 2014 సంవత్సరంలో మనదేశ ప్రధానమంత్రి అయిన టైంలో అమెరికా డాలరుతో భారత రూపాయి మారకం విలువ రూ.61 వద్ద ఉంది. గత పదేళ్లలో ఏకంగా 24  రూపాయల మేర మన రూపాయి పతనమైంది. మనం ఒక అమెరికా డాలరు కోసం ఎక్స్‌ట్రా 24 రూపాయలు (రూ.61 + రూ.24) చెల్లించాల్సి వస్తోంది.

Also Read :GST Council Meeting: పాత కార్లు, పాప్ కార్న్, రెడీమేడ్ దుస్తులపై ‘కౌన్సిల్’ కీలక చర్చలు

డాలరును మన దేశం ఎందుకు వాడుతుంది ? 

  • చాలామంది అమెరికా సంపన్నులు భారత స్టాక్ మార్కెట్‌లో, భారత కంపెనీలలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతుంటారు. ఆ పెట్టుబడులన్నీ అమెరికా డాలర్ల రూపంలో మన దేశానికి వస్తాయి. ఈవిధంగా ఎంత ఎక్కువగా అమెరికా డాలర్లు మనదేశంలోకి వస్తే.. మన రూపాయి అంతగా స్ట్రాంగ్ అవుతుంది. అమెరికా డాలర్లతో మనదేశ ఖజానా ఎంతగా నిండితే.. మన రూపాయి అంతగా బలోపేతం అవుతుంది.
  • ఒకవేళ భారత్ నుంచి దిగుమతులను అనుమతించము అని అమెరికా ప్రకటించింది అనుకుందాం.. అలా జరిగితే.. భారత రూపాయి దారుణంగా దెబ్బతింటుంది. ఎందుకంటే మన దేశ దిగుమతులు అమెరికాకు చేరితే.. అక్కడి నుంచి మనకు డాలర్లు వస్తాయి. అవి రావడం ఆగిపోతే.. మన దేశంలోని విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి. ఫలితంగా రూపాయి డీలా పడుతుంది.