Site icon HashtagU Telugu

PSU Banks : నాలుగు ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాల విక్రయం.. మోడీ సర్కారు సన్నాహాలు

Stake Sale In Public Sector Banks Indian Government

PSU Banks : ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. నాలుగు ప్రభుత్వ బ్యాంకుల్లో మైనారిటీ వాటాలను సేల్ చేయాలని యోచిస్తోంది. ఈ బ్యాంకుల జాబితాలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, పంజాబ్‌ అండ్ సింధ్‌ బ్యాంకు ఉన్నాయి. వీటిలో వాటాను తగ్గించుకునేందుకు మోడీ సర్కారు(PSU Banks) రెడీ అవుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రపోజల్‌తో కూడిన ఫైల్ కేంద్ర క్యాబినెట్ ఎదుటకు ఆర్థిక శాఖ పంపుతుందని అంటున్నారు. ఈ బ్యాంకుల వాటాను ఓపెన్‌ మార్కెట్లో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో సేల్ చేయాలని ఆర్థిక శాఖ ప్లాన్ చేస్తోందట. స్టాక్ మార్కెట్‌ నియంత్రణ సంస్థకు సంబంధించిన పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ రూల్స్ ప్రకారం ఈ నాలుగు ప్రభుత్వ బ్యాంకుల వాటాలను విక్రయించబోతున్నట్లు సమాచారం.

Also Read :Mumtaz Hotel in Tirupati : ముంతాజ్ హోటల్‌పై (TTD) బోర్డు కీలక నిర్ణయం..

  • సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కేంద్ర ప్రభుత్వానికి 93 శాతం వాటా ఉంది.
  • ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి  96.4 శాతం వాటా ఉంది.
  • యూకో బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి  95.4 శాతం వాటా ఉంది.
  • పంజాబ్‌ అండ్ సింధ్‌ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి  98.3 శాతం కంటే ఎక్కువ వాటా ఉంది.
  • అన్ని లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్‌ షేర్ హోల్డింగ్‌ 25 శాతం దాకా ఉండాలని సెబీ రూల్స్ చెబుతున్నాయి. ఈ రూల్స్ నుంచి ప్రభుత్వరంగ సంస్థలకు 2026 ఆగస్టు వరకు సెబీ మినహాయింపును కల్పించింది. ఈ మినహాయింపును వాడుకొని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తమ వాటాను 75 శాతం కంటే దిగువకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
  • ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్రం వాటాలను తగ్గించుకుంటే.. ఆ ప్రభావం ఆయా బ్యాంకుల సిబ్బందిపై పడే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
  • ఆ నాలుగు బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలు తగ్గిన తర్వాత.. వాటి నిర్వహణ, నియామకాలకు సంబంధించిన పాలసీలలో మార్పులు జరిగే ఛాన్స్ ఉంది.
Exit mobile version