స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో (Smartphone Exports) భారత్ సరికొత్త రికార్డు (India sets new record) సృష్టించింది. నవంబర్ నెలలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు రూ. 20,000 కోట్ల మార్కును అధిగమించాయి. ఇది గత ఏడాది నవంబరుతో పోలిస్తే 90% పెరిగింది. నవంబరులో ఎగుమతులు రూ. 20,300 కోట్లకు చేరగా, ఆపిల్ (Apple Phones) ఈ ఎగుమతుల్లో ముందంజలో నిలిచింది. ఆపిల్‌కు గల విజయానికి భారత ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి-లింక్డ్ ప్రోత్సాహక (PLI) పథకం కీలక కారణం. ఈ పథకం ద్వారా ఆపిల్ భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తిని పెంచింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 10 బిలియన్ డాలర్ల ఉత్పత్తి సాధించడమే దీనికి ఉదాహరణ. 7 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లు ఎగుమతులయ్యాయి. ఇది దేశంలో స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తిలో మరొక మైలురాయి గా నిలిచింది.
ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రీమియం, 5G మరియు AI ఆధారిత మొబైల్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్ ప్రధాన కారణంగా భారతదేశం 7-8% వృద్ధి సాధించింది. 2024 నాటికి మార్కెట్ ఇంకా స్థిరంగా వృద్ధి చెందవచ్చని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని వలన స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి మరియు ఎగుమతులు మరింత అభివృద్ధి చెందవచ్చని అంచనా. 2030 నాటికి రూ. 500 బిలియన్ విలువైన స్థానిక ఎలక్ట్రానిక్స్ తయారీ లక్ష్యాన్ని చేరుకోవాలని భారతదేశం భావిస్తోంది. స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు ఈ లక్ష్యానికి చేరుకునేందుకు కీలకమైన పాత్ర పోషించనుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంలో విజయాలు దేశీయ ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తినిచ్చే అవకాశం కల్పించనున్నాయి. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) గణాంకాల ప్రకారం, 2014-15లో రూ. 18,900 కోట్ల మొబైల్ ఫోన్ ఉత్పత్తి 2024 నాటికి రూ. 4.10 లక్షల కోట్లకు చేరింది. ఈ 2,000 శాతం వృద్ధికి కారణం PLI పథకం మాత్రమేనని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Read Also : Weather Updates : వణుకుతున్న తెలంగాణ.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు