World Billionaires 2024 : 2024 సంవత్సరంలో ఏ దేశంలో బిలియనీర్ల సంఖ్య పెరిగింది ? ఏ దేశంలో బిలియనీర్ల సంఖ్య తగ్గింది ? ఆయా శ్రీమంతుల నికర సంపదల్లో చోటుచేసుకున్న హెచ్చుతగ్గులు ఏమిటి ? అనే వివరాలతో ఒక నివేదికను స్విట్జర్లాండ్‌కు చెందిన యూబీఎస్ బ్యాంకు విడుదల చేసింది.
Also Read :Mahbubnagar Earthquake : మహబూబ్‌నగర్ జిల్లాలో స్వల్ప భూకంపం.. దాసరిపల్లిలో భూకంప కేంద్రం
నివేదికలోని కీలక అంశాలివీ..
- ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్న దేశంగా అమెరికా నిలిచింది. అక్కడ అత్యధికంగా 835 మంది బిలియనీర్లు ఉన్నారు.
- ఈ జాబితాలో రెండో స్థానంలో చైనా నిలిచింది. అక్కడ 427 మంది బిలియనీర్లు ఉన్నారు.
- ఈ జాబితాలో మూడో స్థానంలో భారత్ నిలిచింది. మన దేశంలో 185 మంది బిలియనీర్లు(World Billionaires 2024) ఉన్నారు. వీరిలో 108 మంది బిలియనీర్లు కుటుంబ వ్యాపారాలు చేస్తున్న వారే కావడం విశేషం. దీన్నిబట్టి భారత దేశంలో కుటుంబ వ్యవస్థ ఆధారంగా నిర్మితమైన వ్యాపారాలు ఎంత బలంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.
- ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు మధ్యకాలంలో భారత్‌లో కొత్తగా 32 మంది బిలియనీర్ల లిస్టులో చేరారు.
- ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు మధ్యకాలంలో భారతీయ బిలియనీర్ల సంపద దాదాపు 42.1 శాతం పెరిగి రూ.76 లక్షల కోట్ల (905.6 బిలియన్ డాలర్ల)కు చేరింది.
- 2015 సంవత్సరంతో పోలిస్తే మన దేశంలో బిలియనీర్ల సంఖ్య దాదాపు 123 శాతం పెరిగింది.
- ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు మధ్యకాలంలో అమెరికాలో కొత్తగా 84 మంది బిలియనీర్ల జాబితాలో చేరారు. ఇదే సమయంలో చైనాలో బిలియనీర్ల జాబితా నుంచి 93 మంది స్థానాన్ని కోల్పోయారు.
- గత 11 నెలల్లో అమెరికాలో మొత్తం 835 మంది బిలియనీర్ల నికర సంపద 5.8 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఇదే సమయంలో చైనాలో మొత్తం 427 మంది బిలియనీర్ల నికర సంపద 1.8 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది.
- 2015 నుంచి 2024 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల నికర సంపద 121 శాతం మేర పెరిగి 14 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం బిలియనీర్ల సంఖ్య 1,757 నుంచి 2,682కు పెరిగింది.