Site icon HashtagU Telugu

Fake GST Bills : ఫేక్ జీఎస్టీ బిల్లులతో మాయ.. వాటిని ఇలా గుర్తించండి

Fake Gst Bills

Fake GST Bills : పన్ను ఎగవేతలను అరికట్టడమే జీఎస్టీ విధానం లక్ష్యం. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం 2017లో జీఎస్​టీ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే దీన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. నకిలీ జీఎస్టీ బిల్లులతో మోసాలకు తెగబడుతున్నారు. పన్నును ఎగవేస్తూ ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరుస్తున్నారు. ఇంతకీ ఫేక్ జీఎస్టీ బిల్లులను(Fake GST Bills) ఎలా గుర్తించాలి ? అనేది ఈ కథనంలో మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

కొన్ని హోటళ్లు, షోరూమ్‌లు, దుకాణాల నిర్వాహకులు నకిలీ జీఎస్​టీ బిల్లులను ఇస్తున్నట్లు ఇటీవల పలుచోట్ల వెలుగులోకి  వచ్చింది. అలాంటివి గుర్తించాలంటే మనకు వాటిపై కనీస అవగాహన ఉండాలి.  ఆ పాయింట్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

  • జీఎస్టీ బిల్లును చేతిలోకి తీసుకోగానే తొలుత మనం దానిపై ఉండే GSTIN నంబరును చూడాలి. అది 15 అంకెలలో ఉంటుంది. ఇందులో స్టేట్  కోడ్, సరఫరాదారుడి పాన్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటాయి. GSTIN నంబరును జీఎస్టీ పోర్టల్​లో మనం ఎంటర్ చేయగానే.. అందులో  పన్ను చెల్లింపుదారు రకం, రిజిస్ట్రేషన్ తేదీ, రిజిస్ట్రేషన్ స్థానం (రాష్ట్రం), చట్టపరమైన పేరు, వ్యాపారం, వాణిజ్యం పేరు, GSTIN స్టేటస్ అన్నీ మనకు కనిపిస్తాయి. వాటిని బట్టి అది అసలుదా ? నకిలీదా ? తెలుసుకోవచ్చు.
  • జీఎస్​టీ బిల్లులోని ఇన్ ​వాయిస్ నంబర్​, తేదీలను తప్పకుండా చూడాలి. ఇన్​​వాయిస్ నంబర్​ యూనిక్​గా ఉండాలి. వస్తు, సేవలను కొన్న టైమ్ కూడా దానిలో ఉంటుంది. ఇవన్నీ లేకుంటే ఆ బిల్లు ఫేక్.

Also Read :DNA Report : వైద్యురాలిపై అఘాయిత్యం కేసు.. కీలకంగా డీఎన్ఏ రిపోర్టు

  • జీఎస్టీ బిల్లులో సదరు వస్తు సేవలపై విధించిన పన్ను ఎంత అనే సమాచారం స్పష్టంగా ఉంటుంది. జీఎస్​టీ వెబ్​సైట్​లోని కాలిక్యులేటర్ ఓపెన్ చేసి, ఇన్​వాయిస్​లోని డబ్బులకు సరిపడా జీఎస్​టీ వేశారా.. లేదా.. అనేది చెక్ చేసుకోవాలి.
  • జీఎస్​టీ బిల్లుపై సదరు వస్తు, సేవలను అందించే సప్లయర్ లేదా డీలర్ సంతకం ఉండాలి. బిల్లుపై కనిపించే సంతకం జీఎస్​టీ పోర్టల్​లో ఉన్న సంతకం సేమ్ ఉందా లేదా అనేది మనం చెక్ చేయాలి.
  • జీఎస్​టీ పోర్టల్‌లోకి వెళ్లి సదరు వస్తు,సేవలను మనకు అందించిన సప్లయర్‌కు సంబంధించిన​ టాక్స్ పేమెంట్ స్టేటస్​ను కూడా తెలుసుకోవచ్చు. జీఎస్​టీ పోర్టల్​లో సప్లయర్​ వివరాలు కనిపించకుంటే అతడి బిల్లు ఫేక్ అని అర్థం చేసుకోవాలి.
  • ఫేక్ జీఎస్టీ ​బిల్లును ఎక్కడైనా గుర్తిస్తే జీఎస్​టీ పోర్టల్​​లో మీరు కంప్లయింట్ పెట్టొచ్చు. దానిలో ఒక టోల్ -ఫ్రీ నంబరు ఉంటుంది. దానికి కాల్ చేసి వివరాలు చెప్పొచ్చు.