Site icon HashtagU Telugu

Everest – MDH : ఎవరెస్ట్, ఎండీహెచ్‌లకు షాక్.. మసాలా ఉత్పత్తులపై మరో బ్యాన్

Everest Mdh

Everest Mdh

Everest – MDH : మొన్న సింగపూర్.. ఇవాళ హాంకాంగ్.. ఈ దేశాలు వరుసపెట్టి భారతీయ మసాలా కంపెనీలకు షాక్ ఇచ్చాయి. MDH మసాలా ఉత్పత్తులు మనదేశంలో చాలా ఫేమస్. టీవీల్లో వీటి యాడ్స్ కూడా బాగా రన్ అవుతుంటాయి. ఈ కంపెనీ తయారు చేస్తున్న సాంబార్ మసాలాపై బ్యాన్ విధిస్తూ హాంకాంగ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  దీంతో పాటు Everest Food Products ఉత్పత్తులను(Everest – MDH)  బ్యాన్ చేస్తున్నట్లు హాంకాంగ్ ప్రకటన విడుదల చేసింది.

We’re now on WhatsApp. Click to Join

ఎందుకీ బ్యాన్ ?

ఈ మసాలాలో ఇథిలీన్ ఆక్సైడ్ (ethylene oxide) పరిమితికి మించి ఉన్నందున బ్యాన్ విధించాల్సి వచ్చిందని హాంకాంగ్ సర్కారు స్పష్టం చేసింది. ఇథైలీన్ ఆక్సైడ్ అనేది పురుగుల మందు అని, దాన్ని మోతాదుకు మించి వాడితే ప్రాణాలకే ముప్పు అని హాంకాంగ్ సర్కారు పేర్కొంది.  వాస్తవానికి హాంగ్‌కాంగ్‌కి చెందిన  Centre For Food Safety సంస్థ ఈ కంపెనీల మసాలా ఉత్పత్తులపై ఈనెల 5నే బ్యాన్ విధించింది. MDH మసాలా కంపెనీకి చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్‌లో ఇథిలీన్ ఆక్సైడ్‌ అవశేషాలు ఉన్నట్లు అక్కడి తనిఖీ అధికారులు గుర్తించారు. హాంకాంగ్ దేశంలోని మొత్తం మూడు రిటైల్ ఔట్‌లెట్స్‌ నుంచి వీటికి సంబంధించిన  ప్యాక్‌లను సేకరించి తనిఖీ  చేయగా ఇథిలీన్ ఆక్సైడ్‌ అవశేషాలు ఉన్నట్లు వెల్లడైంది. ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాపై సింగపూర్‌ ఇప్పటికే ఆంక్షలు విధించింది. అంతేకాదు మనదేశం నుంచి అక్కడికి ఎగుమతి అయిన మసాలా ప్యాక్‌లను నిర్మొహమాటంగా  వెనక్కి పంపించేసింది. ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలోనూ ఇదే రసాయనం ఉందని అంటున్నారు.

Also Read :Arvind Kejriwal : కేజ్రీవాల్‌‌ విడుదలకు లా స్టూడెంట్ ‘పిల్’.. హైకోర్టు రూ.75వేల జరిమానా

Also Read : Kalki 2898 AD : ‘అశ్వత్థామ’గా అమితాబ్ ఓకే.. మరి కల్కికి ట్రైనింగ్ ఇచ్చే పరశురాముడు ఎవరు..?