Something Big Soon : ‘సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా’.. హిండెన్‌బర్గ్ ట్వీట్.. పరమార్ధం ఏమిటి ?

అమెరికా షార్ట్‌సెల్లర్‌ కంపెనీ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ భారత స్టాక్ మార్కెట్‌లో మరో బాంబును పేల్చేందుకు రెడీ అవుతోందా ? 

Published By: HashtagU Telugu Desk
Hindenburg Research Something Big Soon On India

Something Big Soon : అమెరికా షార్ట్‌సెల్లర్‌ కంపెనీ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ భారత స్టాక్ మార్కెట్‌లో మరో బాంబును పేల్చేందుకు రెడీ అవుతోందా ?  తాజాగా అది చేసిన ట్వీట్‌ను చూస్తుంటే అందరికీ అదే సందేహం వస్తోంది. ‘సమ్‌థింగ్‌ బిగ్‌ సూన్‌ ఇండియా'(Something Big Soon) అని శనివారం ఉదయం తన తన ఎక్స్‌ ఖాతాలో  హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్ పోస్ట్ చేసింది.  దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో వాడివేడి చర్చ జరుగుతోంది. ఏ కంపెనీపై ఈసారి హిండెన్ బర్గ్ నివేదికను విడుదల చేయబోతోంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.భారత స్టాక్ మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసేందుకు, ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసేందుకే భారతీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకొని హిండెన్ బర్గ్ రీసెర్ఛ్ నివేదికలు విడుదల చేస్తోందని పలువురు అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్లు చాలా హైరేంజులో ఉన్నాయి. ఈసందర్భాన్ని స్వప్రయోజనాలకు వాడుకునేందుకు కూడా హిండెన్ బర్గ్ రీసెర్ఛ్ ఈవిధమైన ట్వీట్ చేసిందా అనే అనుమానాలను కొందరు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. హిండెన్ బర్గ్ నివేదికకు సంబంధించిన భయాలతో రాబోయ వారాల్లో స్టాక్ మార్కెట్లు పడిపోతే దాని నుంచి లబ్ధి పొందేందుకు హిండెన్ బర్గ్ ప్రయత్నించే అవకాశం ఉంటుందేమో అనే అనుమానాన్ని వెలిబుచ్చుతున్నారు. మొత్తం మీద స్టాక్ మార్కెట్ వర్గాల్లో దీనిపై వాడివేడి చర్చ జరుగుతోంది.

Also Read :SBI Jobs : ఎస్‌బీఐలో 1100 జాబ్స్.. దరఖాస్తులకు నాలుగు రోజులే గడువు

అదానీ గ్రూప్‌ తమ కంపెనీల షేర్ల రేట్లను కృత్రిమంగా పెంచిందని పేర్కొంటూ 2023 జనవరి 23న హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్ ఒక రిపోర్టును రిలీజ్ చేసింది.  కృత్రిమంగా రేట్లను పెంచిన షేర్లను తనఖా పెట్టి అదానీ గ్రూప్ లోన్లు తీసుకుందని అప్పట్లో ఆరోపించింది.  అకౌంటింగ్ మోసాలకు కూడా అదానీ గ్రూప్ పాల్పడిందని తెలిపింది. పన్నులు చాలా తక్కువగా ఉండే కరీబియన్‌, మారిషస్‌, యూఏఈలలో అదానీ గ్రూప్ కొన్ని షెల్ కంపెనీలను నిర్వహిస్తోందని హిండెన్ బర్గ్ నివేదిక తెలిపింది. ఈ షెల్ కంపెనీల ద్వారా అదానీ గ్రూపు అక్రమ నగదు బదలాయింపులు చేస్తోందని పేర్కొంది. దీంతో అప్పట్లో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు డౌన్ అయ్యాయి. ఈసారి హిండెన్ బర్గ్ నివేదిక ఏ కంపెనీపై ఫోకస్ చేయనుందో వేచిచూడాలి.

  Last Updated: 10 Aug 2024, 12:54 PM IST