HDFC Bank : బీ అలర్ట్.. ఆ 13 గంటలు బ్యాంకు సేవలు బంద్

మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అకౌంట్ ఉందా ? అయితే బీ అలర్ట్. 

  • Written By:
  • Publish Date - July 3, 2024 / 03:03 PM IST

HDFC Bank : మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అకౌంట్ ఉందా ? అయితే బీ అలర్ట్.  ఈనెల 13న(శనివారం రోజు) ఆ బ్యాంక్‌ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. దీంతో ఆ రోజున తెల్లవారుజామున 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దాదాపు 13 గంటలకుపైనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(HDFC Bank) సేవలకు అంతరాయం ఏర్పడనుంది. రానున్న రోజుల్లో కస్టమర్లకు మరింత వేగవంతమైన సేవలను అందించేందుకే ఈ అప్‌గ్రేడ్ చేస్తున్నామని బ్యాంకు ప్రకటించింది. ఎవరికైనా ఆ రోజున అత్యవసర లావాదేవీలు ఉంటే.. కొంచెం ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని కోరింది.  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన కోర్ బ్యాంకింగ్ సిస్టమ్​ను(CBS) కొత్త ఇంజనీరింగ్ ప్లాట్‌ఫామ్‌కు బదిలీ చేస్తున్నట్లు చెప్పింది.  ఈ తరుణంలో జులై 13న అందుబాటులో ఉండే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సేవలు ఏమిటి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

  • జులై 13న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులతో నిర్ణీత పరిమితి మేరకు ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులతో స్వైప్ మెషీన్‌లపై పరిమిత స్థాయిలో లావాదేవీలు చేయొచ్చు. అయితే వీటికి సంబంధించిన మెసేజ్ అలర్ట్​లు మాత్రం నెక్ట్స్ డే ఫోనుకు వస్తాయి.
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అకౌంటు నుంచి నిర్ణీత పరిమితిలో ఆన్‌లైన్ కొనుగోళ్లు చేయొచ్చు.
  • శనివారం రోజు తెల్లవారుజామున 3  గంటల నుంచి 3:45 గంటల వరకు, ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవు.  మిగిలిన సమయాల్లో అంతరాయం ఉండదు.
  • బ్యాంకు అకౌంటులోని బ్యాలెన్స్ ఎంక్వైరీ, పిన్ సెట్ చేసుకోవడం, మార్చుకోవడం అనేవి అందుబాటులో ఉంటాయి.
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు సంబంధించిన నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఆ టైంలలో పనిచేయవు.
  • డీమ్యాట్, కార్డ్‌లు, రుణాలు, మ్యూచువల్ ఫండ్స్, వెల్తిఫై రిపోర్ట్స్ అందుబాటులో ఉంటాయి.
  • ఈ బ్యాంకు కస్టమర్లు  ఈనెల 12న (శుక్రవారం) రాత్రి 7:30 గంటల్లోపు అవసరమైన నగదును విత్‌డ్రా చేసుకుంటే బెటర్.