Stock Market : జీఎస్టీ ఊరటతో స్టాక్ మార్కెట్‌కు బూస్ట్..

Stock Market : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలు ఆర్థిక రంగానికే కాకుండా స్టాక్ మార్కెట్లకు కూడా కొత్త ఊపుని ఇచ్చాయి. సామాన్యుడి జీవితంలో ఉపశమనం కలిగించేలా పన్ను శ్లాబ్‌లను సవరించడంపై తీసుకున్న ఈ నిర్ణయం గురువారం మార్కెట్లలో స్పష్టంగా ప్రతిబింబించింది.

Published By: HashtagU Telugu Desk
Stock Market

Stock Market

Stock Market : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలు ఆర్థిక రంగానికే కాకుండా స్టాక్ మార్కెట్లకు కూడా కొత్త ఊపుని ఇచ్చాయి. సామాన్యుడి జీవితంలో ఉపశమనం కలిగించేలా పన్ను శ్లాబ్‌లను సవరించడంపై తీసుకున్న ఈ నిర్ణయం గురువారం మార్కెట్లలో స్పష్టంగా ప్రతిబింబించింది. రోజు ప్రారంభం నుంచే మార్కెట్‌లో పాజిటివ్ సెంటిమెంట్ నెలకొంది. ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్ 560 పాయింట్లకుపైగా లాభం చూపింది. ఆ ఉత్సాహం కొనసాగుతూ ప్రస్తుతం సెన్సెక్స్ 660 పాయింట్ల లాభంతో 81,228 వద్ద ట్రేడవుతోంది. అదే విధంగా నిఫ్టీ 192 పాయింట్లు ఎగిసి 24,907 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లోకి దూసుకెళ్లిన షేర్లలో బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ట్రెంట్ ముఖ్యంగా నిలిచాయి. మరోవైపు ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందాల్కో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఓఎన్‌జీసీ షేర్లు మాత్రం నష్టపోయాయి. ఇదే సమయంలో BSE మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు పెద్దగా కదలకుండా ఫ్లాట్ ట్రేడింగ్లో కొనసాగుతున్నాయి. మెటల్, ఆయిల్ & గ్యాస్ రంగాల షేర్లు మాత్రం ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

Bigg Boss: బిగ్‌బాస్ 9 కంటెస్టెంట్ల జాబితా లీక్.? సోషల్ మీడియాలో చర్చ హీట్..!

జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న తాజా నిర్ణయాలు పన్ను చరిత్రలో మైలురాయిగా నిలిచేలా కనిపిస్తున్నాయి. సామాన్యుడి నడ్డి విరుస్తున్న 12%, 28% పన్ను శ్లాబ్‌లను పూర్తిగా రద్దు చేసి, ఇకపై 5% మరియు 18% శ్లాబ్‌లను మాత్రమే కొనసాగించేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి అత్యవసరమైన హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయడం మరో కీలక నిర్ణయం. దీంతో కోట్లాది కుటుంబాలకు నేరుగా లాభం కలగనుంది.మరోవైపు, విలాసవంతమైన వస్తువులపై 40% పన్ను విధించాలని నిర్ణయించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది.

ఈ కొత్త, సరళమైన పన్ను విధానం ఈనెల 22 నుంచి అమల్లోకి రానుంది. దీని వలన వస్తువుల ధరలు తగ్గి వినియోగదారులకు ఊరట లభిస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పన్ను తగ్గింపుల వలన వినియోగం పెరగడం, తద్వారా మార్కెట్లకు మరింత దోహదం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

GST 2.0 : సామాన్యులకు భారీ ఊరట.. 18% జీఎస్టీలోకి వచ్చేవి ఇవే..!!

  Last Updated: 04 Sep 2025, 10:18 AM IST