Site icon HashtagU Telugu

Google Pay: గూగుల్‌ పేలో బిల్ పేమెంట్స్‌ చేస్తున్నారా? బ్యాడ్ న్యూస్

Google Pay Convenience Fee Bill Payments

Google Pay: మనలో చాలామంది నిత్యం గూగుల్ పేలో వివిధ రకాల బిల్లులను పే చేస్తుంటారు. ఇప్పటిదాకా మనం జీపేలో ఫ్రీగానే బిల్లులను కడుతూ వచ్చాం. దీనివల్ల జీపే ద్వారా బిల్ పేమెంట్స్ చేసే విషయంలో మనం సంకోచించాల్సిన పరిస్థితి ఎదురు కాలేదు. ఇకపై మాత్రం ఆ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే గూగుల్ పేలో ఇక నుంచి బిల్ పేమెంట్స్ కోసం కన్వీనియన్స్ ఫీజును కట్టాల్సి ఉంటుంది. గూగుల్ పేలో క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు ద్వారా చేసే లావాదేవీలపై మాత్రమే కన్వీనియన్స్‌ ఫీజును తీసుకుంటారు. జీపే‌లో చేసే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలను విధించరు.

Also Read :Rajalinga Murthy : రాజలింగ మూర్తి హత్యపై రాజకీయ దుమారం

పేటీఎం, ఫోన్ పే బాటలోనే..

గూగుల్‌ పే(Google Pay) ద్వారా ఎంతోమంది నిత్యం విద్యుత్‌ బిల్లులు,  గ్యాస్‌ బిల్లులను చెల్లిస్తుంటారు. మరికొందరు క్రెడిట్ కార్డుల బిల్లులు, ఇంటి అద్దెలు, మొబైల్ రీఛార్జ్‌లు, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ బిల్లులను జీపే నుంచి చెల్లిస్తారు. ఇప్పటికే అన్ని రకాల బిల్లుల చెల్లింపులపై పేటీఎం, ఫోన్‌పే యాప్‌లు ఛార్జీని వసూలు చేస్తున్నాయి. ఆలస్యంగానైనా ఇప్పుడు గూగుల్ పే వాటి బాటలోనే పయనించనుంది.

Also Read :APSRTC Jobs: ఆర్టీసీలో కారుణ్య నియామకాలు.. 800 మందికి ఉద్యోగ అవకాశాలు

0.5 శాతం నుంచి 1 శాతం వరకు ఛార్జీ

గూగుల్ పేలో క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుల ద్వారా విద్యుత్‌ బిల్లులు, గ్యాస్‌ బిల్లులను చెల్లిస్తే 0.5 శాతం నుంచి 1 శాతం వరకు ఛార్జీని విధిస్తారు. కార్డ్‌ పేమెంట్‌ ప్రాసెసింగ్‌ ఖర్చుల్ని కవర్‌ చేసేందుకు ఈవిధంగా కన్వీనియన్స్ ఫీజులను తీసుకుంటున్నామని గూగుల్ పే వెల్లడించింది. ఎన్నో ఫిన్‌టెక్‌, క్విక్‌కామర్స్‌, ఫుడ్‌ డెలివరీ సంస్థలు ఫ్లాట్‌ఫామ్‌ ఫీజును వసూలు చేస్తున్న విషయాన్ని అది గుర్తు చేస్తోంది. గూగుల్ పేలో కన్వీనియన్స్ ఫీజులపై ఇప్పుడు నెటిజన్ల మధ్య సైతం చర్చ జరుగుతోంది. యూపీఐ యాప్‌లన్నీ బిజినెస్ విషయంలో ఒక్కటేనని నెటిజన్లు అంటున్నారు. వాటికి వ్యాపారం, లాభాలే తప్ప యూపీఐ యూజర్ల సంక్షేమం పట్టదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.