Sundar Pichai : మన సుందర్ పిచాయ్ ఇక బిలియనీర్.. ఎలా ?

Sundar Pichai : గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ బిలియనీర్ అయ్యారు.

  • Written By:
  • Updated On - May 1, 2024 / 02:39 PM IST

Sundar Pichai : గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ బిలియనీర్ కాబోతున్నారు. ఆయన నికర సంపద విలువ దాదాపు రూ.100 కోట్లకు చేరిందని ‘బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్’ వెల్లడించింది. గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఇద్దరు వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్‌ల పేర్లు ప్రపంచంలోని టాప్-10 ధనవంతుల జాబితాలో ఉంటాయి. అలాంటి అపర కుబేరుల నమ్మకాన్ని చూరగొన్న సుందర్ పిచాయ్ కూడా ఇప్పుడు బిలియనీర్ కాబోతుండటం విశేషం. వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

  • సుందర్‌‌ పిచాయ్‌ను(Sundar Pichai) 2015 సంవత్సరంలో గూగుల్ సీఈఓగా ఆ కంపెనీ వ్యవస్థాపకుడు లారీ పేజ్ నియమించారు.
  • సాధారణంగా కంపెనీల వ్యవస్థాపకుల సంపదే రూ.100 కోట్ల రేంజుకు చేరుతుంటుంది. కానీ ప్రోడక్ట్ మేనేజర్ హోదాలో గూగుల్‌లో చేరిన సుందర్ పిచాయ్ అసాధారణంగా ఉన్నత స్థానాలకు ఎదిగారు.
  • గూగుల్ క్రోమ్, గూగుల్ టూల్ బార్లను డెవలప్ చేసి నెటిజన్లకు చేరువ చేయడంలో కీలక పాత్ర సుందర్ పిచాయ్‌దే. అందుకు ప్రతిఫలంగానే ఆయనకు గూగుల్ సీఈఓ పదవిని కట్టబెట్టారు.
  • 2015 నుంచి ఇప్పటివరకు శాలరీ, ఇతర భత్యాలు, ప్రోత్సాహకాల రూపంలో సుందర్ బాగానే సంపాదించారు.
  • సుందర్‌కు గూగుల్ కంపెనీ కేటాయించిన ‘ఆల్ఫాబెట్ కంపెనీ’ షేర్ల ధరలు గత తొమ్మిది సంవత్సరాల్లో బాగా పెరిగాయి.
  • షేర్ల ధరలు పెరగాలంటే కంపెనీ పనితీరు బాగుండాలి. అలా ఉండేలా చేసిన చోదక శక్తి మన సుందర్ పిచాయ్. సుందర్ నాయకత్వంలో గూగుల్ ఎన్నో టూల్స్‌ను, ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.

Also Read : Congress Vs KTR : అబద్ధాల ఫ్యాక్టరీ పెట్టావా కేటీఆర్‌.. కాంగ్రెస్ సంచలన ట్వీట్

  • గత తొమ్మిదేళ్లలో గూగుల్ కంపెనీ(ఆల్పాబెట్) షేరు విలువ దాదాపు 400 శాతం కంటే ఎక్కువ పెరిగింది.
  •  ఇటీవల కాలంలో గూగుల్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం నుంచి ఆదాయ ప్రవాహం పెరిగింది.
  • ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (జనవరి 1 నుంచి మార్చి 31) ఆల్ఫాబెట్ కంపెనీ ఆర్థిక ఫలితాలు అదుర్స్ అనిపించాయి.
  • గూగుల్ కంపెనీ తొలిసారిగా తమ షేర్ హోల్డర్లకు డివిడెండ్ ప్రకటించింది.
  • ఇవన్నీ కలిసొచ్చి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బిలియనీర్ కాబోతున్నారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విశ్లేషించింది.

Also Read :Utility Bills Payment: ఈ రెండు బ్యాంకుల‌ క్రెడిట్ కార్డులు వాడేవారికి బిగ్ అల‌ర్ట్‌..!