ఐటీ ఉద్యోగులకు (IT Employees) నాస్కామ్ (National Association of Software and Service Companies) గుడ్ న్యూస్ అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో ఉద్యోగాల సంఖ్య రెట్టింపు అవుతుందని నాస్కామ్ తాజా నివేదిక వెల్లడించింది. గత ఏడాది కేవలం 60 వేల కొత్త ఉద్యోగాలు మాత్రమే క్రియేట్ చేయగలిగితే, ఈసారి 1.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి భారత ఐటీ రంగంలో దాదాపు 58 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, ఇది క్రమంగా మరింత పెరిగే అవకాశం ఉందని నాస్కామ్ స్పష్టం చేసింది.
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
భారత టెక్నాలజీ రంగం అద్భుతమైన వృద్ధిని నమోదు చేస్తోంది. 2026 నాటికి ఐటీ పరిశ్రమ ఆదాయం 300 బిలియన్ డాలర్లను దాటి మరింత వేగంగా అభివృద్ధి చెందనుందని నాస్కామ్ అంచనా వేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 4 శాతం వృద్ధి నమోదవగా, 2024-25లో 5.1 శాతం వృద్ధి నమోదైంది. అయితే, 2025-26లో 6.1 శాతం వృద్ధి నమోదు కావాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐటీ సర్వీసెస్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ఈ-కామర్స్ సంస్థలన్నీ ఈ వృద్ధికి దోహదం చేస్తున్నాయి.
Scotch: మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. తగ్గనున్న మద్యం ధరలు!
నేటి ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ ఇంజినీరింగ్, కొత్త టెక్నాలజీల వినియోగం పెరుగుతుండటంతో ఇండస్ట్రీలో పెద్ద మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బ్యాంకింగ్, హెల్త్‌కేర్, రిటైల్, ఎడ్యుకేషన్ రంగాల్లో డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ వేగంగా జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, అమెరికా ట్యాక్స్ వ్యవహారాలు, ఇతర రాజకీయ ప్రభావాలు ఉన్నా భారత ఐటీ రంగం గణనీయమైన వృద్ధిని కొనసాగించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.