పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ దిగివచ్చాయి. అంతర్జాతీయంగా మళ్లీ ఉద్రిక్తతలు పెరిగిన క్రమంలో పసిడి రేట్లు దిగివస్తున్నాయి. రెండు రోజుల్లో తులం బంగారం రేటు రూ.600 పైన తగ్గింది. వెండి రేటు మాత్రం ఈరోజు మరో రూ.500 పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో మే 9వ తేదీన 22, 24 క్యారెట్ల బంగారం రేటు, వెండి ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బంపర్ ఆఫర్. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. వరుసగా రెండో రోజూ దిగివచ్చాయి. అంతర్జాతీయ బులియన్ పోకడలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పెరిగిన క్రమంలో బంగారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. వెండి ధరలు మాత్రం పుంజుకున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. అయితే, అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలకు మరోసారి ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బులియన్ మార్కెట్ పై ప్రభావం కనిపించింది. బంగారం రేట్లు దిగివచ్చాయి. తులం బంగారం రేటు రెండ్రోజుల్లో రూ.600 వరకు తగ్గగా వెండి రేటు మాత్రం రూ.5 వేల వరకు పెరిగింది. ఈ క్రమంలో మే 9వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో పసిడి రేట్లు ఏ స్థాయికి దిగివచ్చాయో ఇప్పుడే మనం తెలుసుకుందాం.
గ్లోబల్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 16 డాలర్ల వరకు పెరిగింది. దీంతో ఔన్స్ బంగారం రేటు 4,715 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.90 శాతం పెరగడంతో 80 డాలర్ల పైకి చేరింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా రెండో రోజూ దిగివచ్చాయి. ఈరోజు 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 330 మేర తగ్గింది. దీంతో తులం బంగారం ధర రూ.1,52,350 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల 916 ప్యూరిటీ గల బంగారం ధర 10 గ్రాములకు రూ.300 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ.1,39,650 వద్దకు పడిపోయింది.
బంగారం ధరలు దిగివచ్చినప్పటికీ, వెండి రేటు మాత్రం మళ్లీ పెరిగింది. ఈ రోజు కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో రూ.5 వేల మేర పెరిగింది. దీంతో కిలో వెండి రూ.2,80,000 మార్కును తాకింది. గత మూడు రోజుల్లోనే కిలో వెండి రేటు రూ.15,000 మేర పెరగడం గమనార్హం.
ప్రముఖ జువెలరీ సంస్థ లలితా జువెలరీల్లో మే 9వ తేదీన బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములకు రూ.300 మేర తగ్గింది. దీంతో తులం బంగారం రేటు రూ.1,39,650 పలుకుతోంది. గ్రాముకు రూ.13,965గా ఉంటుంది.
తనిష్క్ జువెలరీలో కూడా ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 1 గ్రాముకు రూ.30 తగ్గింది. దీంతో గ్రాము రేటు రూ.14,010 వద్దకు చేరింది. ఇక తులం బంగారం రేటు చూస్తే రూ.1,40,100 వద్దకు దిగివచ్చింది.
