పసిడి ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. బంగారం ధరల్లో ఊహించని మార్పు కనిపించింది. యూఏఈ లక్ష్యంగా ఇరాన్ దాడులు చేయడం, అమెరికా నౌకలపై బాంబులు వేయడం వంటి కారణాలతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా సైతం ఇరాన్ నౌకలపై దాడి చేసినట్లు ప్రకటించింది. దీంతో గ్లోబల్ మార్కెట్లో పసిడి రేట్లు భారీగా పెరిగాయి. దాదాపు 100 డాలర్లు పెరగడం గమనార్హం. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లోనూ కనిపించింది. ఈ క్రమంలో మే 6వ తేదీన హైదరాబాద్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు తెలుసుకుందాం.
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊహించని షాక్ తగిలింది. గత రెండు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి రేట్లు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. తులం బంగారం రేటు ఏకంగా రూ.2000 పెరగడం గమనార్హం. అయితే, అందుకు ఓ ప్రధాన కారణం ఉంది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూఏఈ లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. అలాగే హార్ముజ్ జల సంధి వద్దకు వస్తున్న అమెరికా నౌకలపైనా దాడులు చేసినట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఇరాన్‌కు చెందిన కొన్ని నౌకలను పేల్చేసినట్లు అమెరికా సైతం ప్రకటించింది. ఈ క్రమంలో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధం మొదలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై కనిపించింది. ఆసియా సహా భారత మార్కెట్లు సైతం నష్టాల్లో ముగిశాయి. దీంతో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. రెండు రోజులుగా తగ్గిన ధర ఒక్కరోజులోనే పెరిగింది. ఈ క్రమంలో మే 6వ తేదీన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎంతెంత పెరిగాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఔన్స్ బంగారం రేటు దాదాపు 100 డాలర్ల మేర దూసుకెళ్లడం గమనార్హం. ఈ వార్త రాసే సమయానికి స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 91.95 డాలర్లు పెరిగి 4650 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 3.58 శాతం మేర పెరిగి 75.72 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత రెండు రోజుల్లో తగ్గినా ఈరోజు భారీగా పెరగడం గమనార్హం. ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 2130 మేర పెరిగింది. దీంతో తులం బంగారం రేటు రూ.1,51,310 వద్దకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములకు రూ.1950 మేర పెరిగింది. దీంతో తులం రేటు రూ.1,38,700 వద్దకు దూసుకెళ్లింది.
బంగారంతో పాటు వెండి రేటు సైతం భారీగానే పెరిగింది. క్రితం రోజు రూ.5 వేలు దిగొచ్చిన వెండి రేటు ఈరోజు మళ్లీ రూ.5000 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,70,000 మార్కు వద్దకు చేరుకుంది.
