Gold Price Today: బంగారం కొనేవారికి గుడ్ న్యూస్ ..

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఎట్టకేలకు ఊరట లభించింది. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గినా.. దేశీయంగా తగ్గలేదన్న సంగతి తెలిసిందే. ఇంకా పెరిగాయి. అయితే ఇప్పుడు రూపాయి కాస్త కోలుకోవడంతో బంగారం ధర దేశీయంగా దిగొచ్చింది. వెండి ధర మాత్రం రూ. 5 వేల మేర పెరిగింది. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. పసిడి ప్రియులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే […]

Published By: HashtagU Telugu Desk
Gold Rate

Gold Rate

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఎట్టకేలకు ఊరట లభించింది. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గినా.. దేశీయంగా తగ్గలేదన్న సంగతి తెలిసిందే. ఇంకా పెరిగాయి. అయితే ఇప్పుడు రూపాయి కాస్త కోలుకోవడంతో బంగారం ధర దేశీయంగా దిగొచ్చింది. వెండి ధర మాత్రం రూ. 5 వేల మేర పెరిగింది. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పసిడి ప్రియులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే వచ్చిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం ధరలు తగ్గుముఖం పట్టినా, దేశీయంగా ఆ ప్రభావం కనిపించలేదు. ఇక్కడ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకూ పడుతూ ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయిలకు చేరిన క్రమంలో దేశీయంగా బంగారం ధరలు తగ్గలేదు. ఇంకా అంతకుమించి పెరిగాయని చెప్పొచ్చు. గత 3 రోజుల్లోనూ అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెద్దగా పెరగకున్నా, దేశీయంగా మాత్రం భారీగా పెరుగుతూ వచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు ఒక రకంగా షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఈ క్రమంలో పసిడి ధర 10 గ్రాములపై రూ. 3 వేలకు పైనే పెరిగింది. కానీ, ఇవాళ మే 22న (శుక్రవారం) మాత్రం బంగారం ధరలు ఎట్టకేలకు దిగొచ్చాయి. అయినప్పటికీ వెండి ధర పెరిగింది.

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు చూస్తే ఉదయం 10 గంటల సమయంలో రూ. 400 తగ్గడంతో 10 గ్రాములకు రూ. 1,46,200కు చేరింది. గత 3 రోజుల్లో చూసినట్లయితే ఇది వరుసగా రూ. 750, రూ. 2220, రూ. 450 మేర పెరుగుతూ వచ్చింది. దీనికి ముందు 4 రోజులు భారీగా తగ్గింది. మరోవైపు 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర చూస్తే ఇవాళ రూ. 440 తగ్గగా తులం ప్రస్తుతం రూ. 1,59,490 వద్ద ఉంది. ఇది ముందు వరుసగా 3 రోజుల్లో రూ. 490, రూ. 2400, రూ. 820 మేర పెరిగింది.

Hyderabad Silver Price: బంగారం ధరలు తగ్గినా మరోవైపు వెండి రేట్లు వరుసగా రెండో రోజు పెరిగాయి. హైదరాబాద్ నగరంలో సిల్వర్ రేటు రూ. 5 వేలు పెరగడంతో ప్రస్తుతం కేజీకి రూ. 2.95 లక్షలకు చేరింది. దీనికి ముందటి రోజు కూడా ఇది రూ. 5 వేలు పెరిగింది. దీనికి ముందు మే 20న రూ. 15 వేలు తగ్గడం విశేషం.

ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4,520 డాలర్ల వద్ద ఉంది. కిందటి రోజు ఇది 4460 డాలర్ల స్థాయికి కూడా పడిపోయింది. ఇదే సమయంలో సిల్వర్ రేటు చూసినట్లయితే ప్రస్తుతం 76 డాలర్ల స్థాయిలో ఉంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ పుంజుకుంది. ప్రస్తుతం రూ. 96.14 వద్ద ఉంది. కిందటి రోజు ఒక దశలో రూ. 97 కు చేరువలోకి వెళ్లి కనిష్ఠ స్థాయికి పడిపోయింది. రూపాయి పుంజుకోవడంతోనే దేశీయంగా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరల తగ్గింపు ప్రభావం కనిపించిందని చెప్పొచ్చు.

  Last Updated: 22 May 2026, 10:45 AM IST