బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా రెండో రోజూ ధరలు పెరగడంతో కొనుగోలుదారులపై అదనపు భారం పడుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టాలనే ప్రణాళికలను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో పరిస్థితులు మారిపోయాయి. ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం వైపు మళ్లుతున్నారు. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల దిగుమతి సుంకాలు పెంచడం, ఎగుమతులపై ఆంక్షలు విధించడం వంటివి ప్రభావం చూపిస్తున్నాయి. అలాగే రూపాయి విలువ భారీగా పడిపోయి డాలర్ విలువ పెరగడం వల్ల దేశీయంగా పసిడి రేట్లు పెరుగుతున్నాయి. అయితే, గ్లోబల్ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు స్వల్పంగా దిగిరావడం గమనార్హం. ఈ క్రమంలో మే 20వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఈరోజు 22, 24 క్యారెట్లకు ఎంత మేర ఉన్నాయో తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 40 డాలర్లు తగ్గి 4469 డాలర్ల వద్దకు దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.14 శాతం మేర తగ్గింది. దీంతో ఔన్స్ వెండి ధర ఈరోజు 73 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు వరుసగా రెండో రోజూ పెరిగాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు 10 గ్రాములపై క్రితం రోజు రూ. 820 మేర పెరగగా, ఈరోజు మరో రూ.1310 మేర పెరిగింది. దీంతో ఈరోజు తులం బంగారం రేటు రూ.68,350 వద్దకు దూసుకెళ్లింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు ఈరోజు మరో రూ.1200 మేర పెరిగింది. ఇప్పుడు తులం బంగారం రేటు రూ.62,150 వద్దకు చేరింది.
బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి మాత్రం ఊరట కల్పించింది. ఇటీవలే రూ.3 లక్షల మార్క్ దాటిన వెండి మళ్లీ వెనక్కి తగ్గింది. రెండు రోజుల్లో కిలో వెండి రేటు రూ.10 వేల మేర పడిపోయింది. దీంతో ఈరోజు కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో రూ. 2,85,000 మార్క్ వద్ద అమ్ముడవుతోంది.
