నేటి బంగారం ధ‌ర‌లివే.. పెరిగాయా? త‌గ్గాయా?

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ప్రాంతాల్లో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,55,780గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,42,800, 18 క్యారెట్ల ధర రూ. 1,16,840 వద్ద కొనసాగుతోంది.

Published By: HashtagU Telugu Desk
Gold Prices

Gold Prices

Gold Prices: భారత రిటైల్ మార్కెట్‌లో శనివారం (ఏప్రిల్ 18) పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలలో స్వల్ప మార్పులు మాత్రమే చోటుచేసుకున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX) వారాంతాల్లో మూసివేసి ఉండటం వల్ల లైవ్ ట్రేడింగ్ రేట్లు ప్రస్తుతం అందుబాటులో లేవు. గత ముగింపు స్థాయిల ప్రకారం బంగారం ధర పది గ్రాములకు రూ. 1.5 లక్షలపైన కొనసాగుతోంది.

శనివారం ఉదయం 9:20 గంటల సమయానికి దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,890 గా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,41,983 వద్ద ఉంది. ఇండియన్ బులియన్ అసోసియేషన్ ప్రకారం.. కేజీ వెండి (999 ఫైన్) ధర రూ. 2,59,190గా నమోదైంది. రిటైల్ వినియోగదారులు గమనించాల్సిన విషయం ఏమిటంటే.. జ్యువెలర్లు ఈ ధరలకు మేకింగ్ ఛార్జీలు, పన్నులు, జీఎస్‌టీ అదనంగా కలుపుతారు. దీనివల్ల తుది ధర పెరిగే అవకాశం ఉంటుంది.

Also Read: భారత్‌కు ‘గుడ్ న్యూస్’.. హోర్ముజ్ జ‌ల‌సంధి ఓపెన్‌!

పెళ్లిళ్ల సీజన్‌లో కొనసాగుతున్న డిమాండ్

దేశంలో వివాహాల సీజన్ మొదలైంది. బంగారం, వెండి ధరలు పెరిగినప్పటికీ జ్యువెలరీ షోరూమ్‌లలో కస్టమర్ల రద్దీ తగ్గలేదు. ధరల పెరుగుదల కొనుగోళ్లపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే దాని ప్రభావం స్థానిక మార్కెట్‌పై కూడా పడవచ్చని, అప్పుడు కస్టమర్లకు కొంత ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ధ‌ర‌లు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ప్రాంతాల్లో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,55,780గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,42,800, 18 క్యారెట్ల ధర రూ. 1,16,840 వద్ద కొనసాగుతోంది.

ప్ర‌ముఖ న‌గ‌రాల్లో ధ‌ర‌లు

దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు కోల్‌కతా నగరాల్లో కూడా ఇవే ధరలు నమోదయ్యాయి. ఈ రెండు నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రూ. 1,55,780, 22 క్యారెట్ల పసిడి రూ. 1,42,800, 18 క్యారెట్లు రూ. 1,16,840 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ధరలు మిగతా నగరాల కంటే స్వల్పంగా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం రూ. 1,55,120 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,42,200, 18 క్యారెట్ల ధర రూ. 1,16,380 గా ఉంది. త‌మిళనాడు రాజధాని చెన్నైలో 18 క్యారెట్ల బంగారం ధర ఇతర నగరాల కంటే కాస్త ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక్కడ 24 క్యారెట్లు రూ. 1,55,010, 22 క్యారెట్లు రూ. 1,42,090, 18 క్యారెట్లు రూ. 1,18,590 వద్ద ఉంది.

  Last Updated: 18 Apr 2026, 10:21 AM IST