Gold Price : బంగారం, వెండి ధరలు గతవారం రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండు రోజులుగా బంగారం ధర పెరుగుతూ వస్తుంది. బుధవారం కూడా వినియోగదారులకు బంగారం, వెండి ధరలు షాకిచ్చాయి. బుధవారం ఉదయం 11 గంటలకు బంగారం ధరలు మారాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.500, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.550 మేర ధర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,150కి చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,620కి పెరిగింది.
మరోవైపు బంగారం ధర పెరగ్గా.. వెండి ధర స్థిరంగా ఉంది. నవంబర్ 15 నుంచి 18 వరకూ ఎలాంటి పెరుగుదల లేని వెండికి.. నిన్న రెక్కలొచ్చాయి. ఒకేసారి కేజీ వెండి ధరపై రూ.2000 పెరగడంతో.. మళ్లీ లక్ష మార్కును దాటేసింది. నవంబర్ 14 నుంచి 18 వరకూ రూ.99,000 ఉన్న వెండి ధర నిన్న రూ.1,01,000కు చేరింది. నేడు కూడా అదే ధర కొనసాగుతోంది.
ఇకపోతే.. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా వరుసగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2640 డాలర్ల స్థాయికి చేరింది. 2 రోజుల కిందట ఇది 2560 డాలర్ల స్థాయిలో ఉండేది. అంటే దాదాపు 80 డాలర్ల వరకు పెరిగిందని చెప్పొచ్చు. ఇక స్పాట్ సిల్వర్ రేటు 31.20 డాలర్ల వద్ద ఉంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 84.45 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
22 క్యారెట్ల బంగారం ధర..
.ఢిల్లీలో రూ. 70,810
.విజయవాడలో రూ. 70,660
.హైదరాబాద్‌లో రూ. 70,660
.చెన్నైలో రూ. 70,660
.ముంబయిలో రూ. 70,660
.బెంగళూరులో రూ. 70,660
.కోల్‌కతాలో రూ. 70,660
.కేరళలో రూ. 70,660
.పూణేలో రూ. 70,660
24 క్యారెట్ల బంగారం ధర..
.ఢిల్లీలో రూ. 77,230
.విజయవాడలో రూ. 77,080
.హైదరాబాద్‌లో రూ. 77,080
.చెన్నైలో రూ. 777,080
.ముంబయిలో రూ. 77,080
.బెంగళూరులో రూ. 77,080
.కోల్‌కతాలో రూ. 77,080
.కేరళలో రూ. 77,080
.పూణేలో రూ. 77,080
ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
.ఢిల్లీలో రూ. 91,600
.హైదరాబాద్‌లో రూ. 1,01,100
.విజయవాడలో రూ. 1,01,100
.చెన్నైలో రూ. 1,01,100
.కేరళలో రూ. 1,01,100
.ముంబయిలో రూ. 91,600
.కోల్‌కతాలో రూ. 91,600
.బెంగళూరులో రూ. 91,600