ఇటీవల వరుసగా పెరుగుతూ వినియోగదారులను ఆందోళనకు గురిచేసిన బంగారం ధరలు (Gold Price) ఇప్పుడు శ్రావణ మాసం (Sravanamasam) ప్రారంభం రోజున తగ్గి ఊరటను కలిగించాయి. గత కొన్ని వారాలుగా 24 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయల మార్క్‌ను దాటి సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. అయితే నేడు బులియన్ మార్కెట్ విడుదల చేసిన ధరల ప్రకారం.. బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గడం గమనార్హం.
Vishwambhara : చిరంజీవి కోసం రంగంలోకి దిగిన హాట్ బ్యూటీ
నేడు ఉదయం 8 గంటల వరకు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,380 తగ్గి రూ.1,00,960గా నమోదైంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,540గా ఉంది. వెండి ధర కూడా ఒక్కరోజులో కిలోకి రూ.2,000 తగ్గి రూ.1,17,100కు చేరింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, విజయవాడ, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో ఈ తగ్గుదల కనబడుతోంది. హైదరాబాద్, ముంబై, బెంగళూరుల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,960గా ఉండగా, ఢిల్లీలో మాత్రం కొంత ఎక్కువగా రూ.1,01,111గా ఉంది.
Pawan Kalyan : దమ్ముంటే తిరిగి కొట్టండి..అంటూ పవన్ పిలుపు
పసిడి ధరల తగ్గుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్ మొదలుపెట్టడమే. దీని ప్రభావంగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు దిగజారాయి. గతంలో ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేసిన వారు ఇప్పుడు లాభాల కోసం అమ్మకాలు చేపట్టడంతో మార్కెట్‌లో సర్దుబాటు ఏర్పడింది. అంతేకాక, డాలర్ బలపడటం, ఇంట్రెస్ట్ రేట్‌లు స్థిరంగా ఉండటం కూడా పసిడి మీద ప్రభావం చూపిన అంశాలుగా కనిపిస్తున్నాయి. నేటి నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో బంగారం కొనుగోళ్లకు ఇది సరైన సమయంగా భావించబడుతోంది. వరుసగా పెరుగుతున్న ధరలతో వెనకడుగు వేసిన వినియోగదారులు, ఇప్పుడు ధరలు తగ్గడంతో మళ్లీ కొనుగోళ్లపై ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయి. శ్రావణమాసం వంటి పవిత్రమైన సమయాల్లో బంగారం కొనుగోలు శుభప్రదంగా భావించబడుతుండటంతో ఇది వినియోగదారులకు డబుల్ బోనస్‌గా మారే అవకాశం ఉంది.