ధంతేరాస్ తర్వాత బంగారం, వెండి ధరల్లో చోటుచేసుకున్న హెచ్చుతగ్గులు ఇప్పుడు మార్కెట్‌లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల వరుసగా తగ్గిన బంగారం ధరలు అక్టోబర్ 31న మళ్లీ పెరగడం గమనార్హం. మార్కెట్ సమాచారం ప్రకారం… 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం తులం ధర రూ.1,200 పెరిగి రూ.1,22,680కు చేరింది. అలాగే 22 క్యారెట్ బంగారం ధర రూ.1,100 పెరిగి రూ.1,12,450గా నమోదైంది. 18 క్యారెట్ బంగారం ధర కూడా రూ.900 పెరిగి రూ.92,010కి చేరింది. మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి రూ.1,65,000 వద్ద కొనసాగుతుండగా, అక్టోబర్ 15తో పోలిస్తే రూ.42,000 మేర తగ్గింది. గడచిన నెలల్లో బంగారం ఆల్‌టైమ్ హై స్థాయి నుంచి సుమారు రూ.12,000 తక్కువ స్థాయిలో లభించడం పెట్టుబడిదారులకు కొంత ఊరటనిస్తోంది.
India Victorious: వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు!
అంతర్జాతీయ స్థాయిలో కూడా విలువైన లోహాల ధరల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మల్టీ కమాడిటీ ఎక్స్‌ఛేంజ్ (MCX)లో గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.390 తగ్గి రూ.1,21,118 వద్ద ట్రేడవుతుండగా, సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.531 తగ్గి రూ.1,48,309 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం 3993 డాలర్ల వద్ద, వెండి 48.81 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అమెరికా డాలర్ బలపడటంతో ఇతర కరెన్సీలలో బంగారం కొనుగోలు ఖరీదైనదిగా మారింది. దీంతో కొంతమంది ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అయితే, బంగారం వరుసగా మూడో నెల లాభాలతో ముగిసే దిశలో పయనిస్తోంది, ఇది దీర్ఘకాల పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచే అంశంగా నిపుణులు చెబుతున్నారు.
Sardar Vallabhbhai Patel: నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి!
ఈ మార్పుల వెనుక ప్రధాన కారణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న వడ్డీ రేట్ల నిర్ణయాలను నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది రెండోసారి వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించి 3.75% నుంచి 4.00% రేంజ్‌లో ఉంచింది. అయితే, ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యల నేపథ్యంలో డిసెంబర్‌లో మళ్లీ వడ్డీ తగ్గుతుందా అన్న అనుమానం ట్రేడర్లలో పెరిగింది. సీఎంఈ గ్రూప్ ఫెడ్వాచ్ టూల్ ప్రకారం, డిసెంబర్‌లో వడ్డీ రేటు తగ్గించే అవకాశం ప్రస్తుతం 74.8% వద్ద ఉన్నదని తెలుస్తోంది. వడ్డీ రేట్లు తగ్గితే సాధారణంగా బంగారం ధర పెరుగుతుంది, ఎందుకంటే పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లుతారు. ఇదే కారణంగా బంగారం, వెండి మార్కెట్‌పై ప్రపంచ ఆర్థిక నిర్ణయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

